Social 1080×1350 • Multi-page
26-01-2026 BREAKING NEWS 07:12 PM
swarnodayam.com
Telugu Daily News

ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలకు తీవ్ర అన్యాయం. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలకు తీవ్ర అన్యాయం. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20260126-WA0209

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
వచ్చే నెలలో జరగ బోయే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతి ఎన్నికలలో వార్డు రిజర్వేషన్లలో ఓసిలకు పాలకులు అధికారులు తీవ్ర అన్యాయం చేశారని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సోమవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఓసి ఐకాస రాష్ట్ర నాయకుల ప్రత్యేక సమావేశంలో రామారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతి ఎన్నికలలో వార్డు సభ్యుల రిజర్వేషన్లలో ఓసిలను అనగతొక్కే కుట్రలతో ఓసిల జనాభా 80 శాతం ఉన్న చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు చేస్తున్నారని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు 79 నుంచి 89 శాతం ఉన్న చోట జనరల్ స్థానాలుగా రిజర్వేషన్లు అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని దీంతో ఓసిలు తీవ్రంగా నష్టపోతున్నారని రామారావు ఆరోపించారు. జనరల్ స్థానాల్లో ఓసియేతరులు 80 శాతం ఉండటంతో ఓసిలు గెలవలేరని, ఓసిల జనాభా 80 శాతం ఉన్న చోట ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో ఓసిలు అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు.

మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
ఈ రిజర్వేషన్లపై శాస్త్రీయంగా చేయకపోతే ప్రభుత్వాన్ని స్థంభింప జేసి రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
గత స్ధానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా చేయడం వల్ల జనరల్ స్థానాల్లో సైతం ఓసిలు 10 శాతం కూడా గ్రూపొందక అవకాశాలు కోల్పోయారని రామారావు వెల్లడించారు. అలాగే జనరల్ స్థానాల్లో సైతం రాజకీయ పార్టీలు ఓసియేతరులకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించడం మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఓసిలు అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం రాజకీయ పార్టీలు వైఖర్ మార్చకోక పోతే ఓసిల తడాఖా చూపిస్తానని రామారావు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. స్ధానిక ఎన్నికల్లో ఇప్పటికీ ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు లేవని, 50శాతం రిజర్వేషన్లు దాటకుండా ఉన్న ప్రస్తుత రిజర్వేషన్లలో ఓసిలకు తగిన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఇట్టి డిమాండ్ల సాధనకు ఓసి జేఏసీ చేస్తున్న రాష్ట్ర జాతీయ స్థాయి పోరాటంలో ఓసిలు రాజకీయాల కతీతంగా ఐక్యంగా చేతులు కలిపి ప్రభుత్వాల మెడలు వంచాలని రామారావు పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు వేముల సుదర్శన్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, తీగల లక్ష్మణ్ రావు, రాచమడుగు నరసింగరావు, తోపుచర్ల శ్రీనివాస్, జిల్లా అంజయ్య తదితరులు ఉన్నారు

మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!