26-01-2026 NORMAL NEWS 09:17 PM
swarnodayam.com
Telugu Daily News
26-01-2026 09:17 PM By Mandala Yadagiri

తెలంగాణ హాకీ జట్టు కోచ్ గా విక్రమ్, మేనేజర్ గా శ్యామ్ లు ఎంపిక

తెలంగాణ హాకీ జట్టు కోచ్ గా విక్రమ్, మేనేజర్ గా శ్యామ్ లు ఎంపిక
IMG_20260126_210936

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
త్వరలో ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే 69వ ఎస్ జిఎఫ్ ఐ జాతీయస్థాయి అండర్-17 హాకీ పోటీలకు తెలంగాణ హాకీ బాలుర జట్టు టీం కోచ్ గా మోటపోతుల విక్రమ్, మేనేజర్ గా సాదుల శ్యాం కుమార్ లు ఎంపికయ్యారు. ఈనెల 27 నుండి 31 వరకు రాంచీలో జాతీయస్థాయి అండర్ -17 హాకీ పోటీలు జరగనుండడంతో హుజురాబాద్ పట్టణానికి చెందిన మోటపోతుల విక్రమ్ తెలంగాణ హాకీ టీం కోచ్ గా, జట్టు మేనేజర్ గా సాదుల శ్యాం కుమార్ లను ఎంపిక చేశారు. హాకీలో వీరు చూపుతున్న ప్రతిభ క్రీడా అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తించి వీరిని ఎంపిక చేశారు. మీరు ఎంపిక పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, క్లబ్ మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి బోడిగే తిరుపతి, గంగిశెట్టి ఉమామహేశ్వర్, భూసారపు శంకర్, వేముల రవికుమార్, యూసుఫ్, ఎండి సజ్జు, మాటూరి రాజేష్, నిమ్మటూరి సాయికృష్ణ, కాయంకంటి రాజేష్, గుడ్డేలుగుల ప్రదీప్, సబ్బని విక్రం, వినయ్, వంశీ, విపుల్, బన్నీ, రాజ్ కుమార్, మితిన్, మధు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ హాకీ టీం కోచ్ గా ఎంపికైన మోటపోతుల విక్రమ్

జట్టు మేనేజర్ గా ఎంపికైన సాదుల శ్యాం కుమార్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!