Social 1080×1350 • Multi-page
26-01-2026 BREAKING NEWS 10:04 PM
swarnodayam.com
Telugu Daily News

అమర్ త్రో లో బంగారు పతకం సాధించిన చెల్పూర్ వాసి రఘుకు క్రీడారత్న పురస్కారం..

అమర్ త్రో లో బంగారు పతకం సాధించిన చెల్పూర్ వాసి రఘుకు క్రీడారత్న పురస్కారం..
IMG-20260126-WA0199

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన వంతడుపుల రఘు అనే క్రీడాకారుడు అంతర్జాతీయ అథ్లెటిక్స్ లో రాణిస్తూ Hammer throw(హమ్మర్ త్రో లో) బంగారు పథకం సాధించారు. వారి కృషిని గుర్తిస్తూ వారికి జాతీయ క్రీడారత్న పురస్కరానికి ఎంపిక చేసినట్లు వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి(రి) ప్రకటించాయి. ఆయనకి త్వరలో హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో పురస్కారంతో పాటు ఘనంగా సత్కరించనున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఆ సంస్థల కన్వీనర్ మధుకర్ వైద్యుల, ఈ సుమలతలు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా క్రీడారత్న పురస్కారానికి రఘు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

జాతీయ క్రీడా రత్న పురస్కారానికి ఎంపికైన రఘు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!