Social 1080×1350 • Multi-page
27-01-2026 BREAKING NEWS 04:56 PM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్రంలో మ్రోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. 28 నుంచే నామినేషన్ల స్వీకరణ, -11న ఎన్నికలు, 13న కౌంటింగ్.

రాష్ట్రంలో మ్రోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. 28 నుంచే నామినేషన్ల స్వీకరణ, -11న ఎన్నికలు, 13న కౌంటింగ్.
IMG_20260127_165444

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం 2,996 మున్సిపల్‌ వార్డులకు ఎన్నికలు ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుష ఓటర్లు 25 లక్షల 62 వేలు, మహిళా ఓటర్లు 26 లక్షల 80వేలు
ఇతర ఓటర్లు 640 తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 16న చైర్ పర్సన్స్, మేయర్ల ఎన్నిక ఉంటుంది. కాగా ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, జనవరి 28వ తేదీ (బుధవారం) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను జనవరి 30వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే:

నామినేషన్ల ప్రారంభం: 28.01.2026 (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు).

నామినేషన్ల ముగింపు: 30.01.2026 (సాయంత్రం 5:00 గంటల వరకు).

ఈ నెల 31న స్క్రూట్నీ,
ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు.

ఓటింగ్ : 11.02.2026 ( 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు).

రీపోలింగ్ : 12.02.2026 ( 7గంటల నుంచి 5 గంటల వరకు).

కౌంటింగ్: 13.02.2026 న ఉదయం 8 గంటల నుండి ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!