Social 1080×1350 • Multi-page
28-01-2026 BREAKING NEWS 12:28 AM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ పార్టీకి బై బై – బిఆర్ఎస్ పార్టీలో చేరిన డాక్టర్ సురంజన్..- చైర్మన్ గిరి కోసం పార్టీ ఫిరాయింపు !?

కాంగ్రెస్ పార్టీకి బై బై – బిఆర్ఎస్ పార్టీలో చేరిన డాక్టర్ సురంజన్..- చైర్మన్ గిరి కోసం పార్టీ ఫిరాయింపు !?
IMG-20260128-WA0000

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన్ ఆదివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నెల 19న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విధితమే. అయితే మళ్ళీ వారం రోజులు తిరగా కుండానే బిఆర్ఎస్ లో చేరడంతో కేవలం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పార్టీ ఫిరాయించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. బిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ సురంజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఆదరణ లేదని, జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులే కరువయ్యారని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ నెరవేర్చడం లేదని అన్నారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎదురు ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పి రామస్వామి, KDCC మాజీ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, మాజీ MPP వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు భాస్కర్, దిలీప్, రమేష్ పాల్గొన్నారు.

ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కౌశిక్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!