Social 1080×1350 • Multi-page
28-01-2026 BREAKING NEWS 09:17 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక.

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక.
IMG-20260128-WA0042

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. తాజాగా హుజురాబాద్ పట్టణానికి చెందిన మిడిగిరి వినీత, గన్నారపు శ్రీకాంత్, గన్నారపు లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ పార్టీకి చెందిన వడ్లకొండ కిరణ్, పోలు రాజయ్య, మోహన్, కృష్ణ ప్రసాద్, రవీందర్, అరుణ, గోపికృష్ణ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్బంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ గూడూరి రాజేశ్వరి-స్వామిరెడ్డి, మండల అధ్యక్షుడు కిరణ్, సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, నేరేళ్ల మహేందర్, కొండ గణేష్, వెంకటస్వామి, ఉప్పు శ్రీను, నర్సింఘం, జమదగ్ని, మార్త రవీందర్, కుమార్, వేణు, మండ సాయి తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!