28-01-2026 NORMAL NEWS 11:24 PM
swarnodayam.com
Telugu Daily News
28-01-2026 11:24 PM By Mandala Yadagiri

ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు. – హుజురాబాద్ కమిషనర్ ముసబ్ అహ్మద్

ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు. – హుజురాబాద్ కమిషనర్ ముసబ్ అహ్మద్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న 30 వార్డుల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 29,531 నమోదయాయని, అందులో పురుషులు 14,357, మహిళలు 15,170 మంది, ఇతరులు నలుగురు ఉన్నట్లు ఆయన తెలిపారు. 30 వార్డుల నామినేషన్లు స్వీకరించడానికి గాను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు మొత్తం పది క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క క్లస్టర్లో ఒక ఆర్ ఓ, ఒక ఏ ఆర్ఓ లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఒక క్లస్టర్లో మూడు వార్డుల నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరిస్తారన్నారు. 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం జరుగుతుందని తెలియజేశారు. పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను పూర్తి చేయడానికి ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు, సందేహాల నీవృత్తి కోసం అధికారుల సలహాలు సూచనలు తీసుకొని పూర్తి చేసిన అనంతరం నామినేషన్లను దాఖలు చేయాలని అన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!