31-01-2026 NORMAL NEWS 05:17 PM
swarnodayam.com
Telugu Daily News
31-01-2026 05:17 PM By Mandala Yadagiri

బేషరతుగా మైనారిటీ సోదరులకు అంబేద్కర్ చౌరస్తాలో క్షమాపణ చెప్పాలి..సోషల్ మీడియాలో హైప్ కోసం ఎంతకైనా తెగిస్తావా? -కౌశిక్ రెడ్డి చిల్లర వేషాలు మానుకో..ప్రణవ్..

బేషరతుగా మైనారిటీ సోదరులకు అంబేద్కర్ చౌరస్తాలో క్షమాపణ చెప్పాలి..సోషల్ మీడియాలో హైప్ కోసం ఎంతకైనా తెగిస్తావా? -కౌశిక్ రెడ్డి చిల్లర వేషాలు మానుకో..ప్రణవ్..
IMG-20260131-WA0035

చస్తా అని భార్యాబిడ్డలతో ఏడిస్తే ఓటేసిన పాపానికి హుజురాబాద్ ప్రజలకు ఇంత నరకం చూపెట్టాలా? -బాధ్యత గల పదవిలో ఉండి వీణవంక ను తగలబెడుతావా?ఈ ఘటనపై కేటీఆర్,హరీష్ రావు సమాధానం చెప్పాలి

నీ వల్ల హుజూరాబాద్ పరువు మొత్తం పోతుంది.

వ్యక్తిగత ఇమేజ్ కోసం కాంగ్రెస్ పార్టీపై నిందలు మోపితే చూస్తూ ఊరుకోం..

ఆటలు సాగడానికి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం.

గడిచిన రెండేళ్లలో కాంట్రవర్సి తప్ప,హుజురాబాద్ కు చేసింది ఏం లేదు?

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం.

ఆశీర్వదించండి,అభివృద్ధి చేసి చూపిస్తాం.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వ్యక్తిగత ఇమేజ్ కోసం, అత్యుత్సాహంతో తప్పు చేయడం ఆపై క్షమాపణ కోరడం కౌశిక్ రెడ్డికి అలవాటు అయ్యిందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రోజున కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక అబద్ధపు ప్రచారాన్ని విడుదల చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని కట్టు కథలు అల్లుతున్నాడని ముఖ్యమంత్రి, మంత్రులపై, కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కోర్టు ఆదేశాలు అమలులో ఉండగా కావాలని కౌశిక్ రెడ్డి బిల్డప్ ఇచ్చి ర్యాలీగా బయలుదేరాడనీ,కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తే చట్టం తన పని తను చేసుకుంటుందని, దీంట్లో ఎవరికి మద్దతు పలకలేదని, అంతగా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే పక్కనే ఉన్న సారలమ్మ దర్శనం చేసుకోవాలి, లేదంటే సమ్మక్క సారలమ్మ వచ్చిన తేదీ నిన్న శుక్రవారం దర్శనం చేసుకోవాలి కానీ కోట్లాది మంది కొలిచే జాతరలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం ఏంటని, జాతరలో కూడా తన రాజకీయ దురుద్దేశాన్ని చూపెట్టాడని మండిపడ్డారు. ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తామంటే కుదరదని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం అనీ కౌశిక్ రెడ్డి ఇది గుర్తు పెట్టుకోవాలని, గడిచిన రెండేళ్లలో కాంట్రవర్సిలు తప్ప హుజురాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదని అన్నారు.

హరీష్ రావు,కేటీఆర్ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి..

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

బాధ్యత గల పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించే జాతరలో తన పెత్తనం నడవకపోతే వీణవంక మండలాన్ని తగలబెడుతాం అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడడం పట్ల కేటీఆర్,హరీష్ రావు సమాధానం చెప్పాలని ఇలాంటి ఎమ్మెల్యేను పక్కన పెట్టుకొని మీరు మీ నియోజకవర్గంలో కూడా ఇలాంటి రాజకీయ దూషణలు చేస్తున్నారా అని ప్రశ్నించారు ప్రణవ్.ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

పోలీసులపై ఆ భాష ఏంది కౌశిక్? సిపి గురించి మాట్లాడే మాటలేనా అవి?

ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థను బట్టుకొని కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రణవ్.కరీంనగర్ కమీషనర్, ఎసిపి గా ఉన్న అధికారిని పట్టుకొని మత విదేశాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం,విధులకు భంగం కలిగించడం సిగ్గుచేటని, ఉద్దేశ్య పూర్వకంగా వ్యాఖ్యలు చేసి తప్పించుకుంటున్నాడని ఇలాంటివి కౌశిక్ రెడ్డికి కొత్తవి కావని గతంలో గవర్నర్, మహిళల పట్ల,అధికారుల పట్ల, కులం పేరుతో, మతం పేరుతో దూషించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసుల తీరు చూస్తే ఒక్కటైన ప్రజా ఉద్యమం కోసం ప్రజల అవసరాల కోసం కోట్లాడలేదని ఎంతసేపు తన స్వంత లాభం కోసం చూసుకుంటున్నాడని మండిపడ్డారు..

Oplus_16908288

హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ పీఠాలు కాంగ్రెస్ వే..

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని, పట్టణాల అభివృద్ధి కొరుకు 30కోట్లు (జమ్మికుంట15, హుజురాబాద్15) మంజూరు చేశామని,దాంతో పాటు పదేళ్లుగా జరగని పనులను ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నామని, ఈ నెల 11 జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని తద్వారా మున్సిపాలిటీలకు మరింత అభివృద్ధికి దోహదం పడుతుందని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. అలాగే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పేదలకు అందజేసే సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి లు అందజేశామని అన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!