Social 1080×1350 • Multi-page
01-02-2026 BREAKING NEWS 03:00 PM
swarnodayam.com
Telugu Daily News

రాజకీయ కక్షతో కేసీఆర్‌కు సిట్ నోటీసులు – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో హుజురాబాద్‌లో భారీ ర్యాలీ!

రాజకీయ కక్షతో కేసీఆర్‌కు సిట్ నోటీసులు – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో హుజురాబాద్‌లో భారీ ర్యాలీ!
IMG-20260201-WA0035

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ బాపూజీగా ప్రజల గుండెల్లో నిలిచిన గౌరవనీయులు కేసీఆర్‌కు సిట్ నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

హుజురాబాద్ పట్టణ సమీపంలోని సిరసపల్లి క్రాస్ రోడ్ నుంచి శాలపల్లి, ఇందిరానగర్ వరకు కొనసాగింది. రంగాపూర్, గొల్లపల్లి, రాజపల్లి, చెల్పూర్ గ్రామాల మీదుగా సాగిన ఈ ర్యాలీ అంతా జై తెలంగాణ జై కెసిఆర్ CM డాం డాం నినాదాలతో మారుమోగింది. అనంతరం తిరిగి సిరసపల్లి క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ బైక్ ర్యాలీలో దాదాపు 2000 బైకులు పాల్గొనగా, సుమారు 4000 మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కేసీఆర్‌కు సిట్ నోటీసులు పంపడం హేయమైన, రాజకీయ కక్షతో చేసిన చర్యగా తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌పై ఎలాంటి అక్రమాలు లేవని, ప్రజలే ఆయనకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణం ఎన్నికల ఇంచార్జ్ భూపతిరెడ్డి, జమ్మికుంట పట్టణం ఇంచార్జ్ సుదీర్, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Oplus_16908288

భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!