01-02-2026 NORMAL NEWS 04:14 PM
swarnodayam.com
Telugu Daily News
01-02-2026 04:14 PM By Mandala Yadagiri

ఓసిల హక్కుల సాధనకు 23న ఓసిల మహా ధర్నాకు చలో ఢిల్లీ.. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు.

ఓసిల హక్కుల సాధనకు 23న ఓసిల మహా ధర్నాకు చలో ఢిల్లీ.. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు.
IMG-20260201-WA0051

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఓసీల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 23న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయస్థాయి ఓసిల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం, మానకొండూర్, సైదాపూర్ మండలాల వివిధ ఓసి కుల సంఘాల రాష్ట్ర జిల్లా నాయకుల నాయకులతో కలిసి ఈనెల 23న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓసిల మహా ధర్నా విజయవంతం చేయాలని ఓసి జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ
దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రకుల పేద సామాజిక వర్గాలలోని పేద విద్యార్థినీ విద్యార్థులు, రైతులు, మహిళలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ విషయాల్లో జరుగుచున్న అన్యాయాన్ని పరిష్కరించుకునే దిశగా అన్ని వర్గాల ప్రజల పక్షాన దేశం నడి ఒడ్డున జరుగుచున్న ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ధర్నా నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కను విప్పు కలిగే విధంగా ఉంటుందని రామారావు తెలియజేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతుల్లేని 5 ఏండ్ల కాలపరిమితి కలిగి ఉండాలని, ఈడబ్లూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని, ప్రస్తుతం 50 శాతం పెంచకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

Oplus_16908288

శంకరపట్నం ఓసి జేఏసీ మీటింగుల్లో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించే భాగస్వామ్యం ఉండే చట్టం తేవాలని, రైతులకు రైతు భీమా వర్తించే పరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ఓసి జేఏసీ అధ్యక్షుడుగా మానకొండూర్ మండల సదాశివపల్లి గ్రామానికి చెందిన ఏనుగు చొక్కారెడ్డిని జిల్లా నాయకుల ఆమోదంతో పోలాడి రామారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి, ఉమ్మడి జిల్లా రెడ్డి సంఘాల నేత, ఓసి ఐకాస రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతిరెడ్డి రమణారెడ్డి, కర్కఅనంతరెడ్డి తణుకు ప్రభాకర్, కలకుంట్ల సత్యనారాయణరావు, కలకంట్ల శేషు, గౌతంశర్మ, సర్పంచ్ బొల్లెడ్ల కమలా జగన్ రెడ్డి, ఇప్పలపల్లి నూతనరెడ్డి సంఘం అధ్యక్షుడు గీట్ల సంపత్ రెడ్డి, అంబాల్ పూర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, గీట్ల ఆనందరెడ్డీ, పాశం శ్రీదర్ రెడ్డి, చింతిరెడ్డి అన్నారెడ్డి, గీట్ల సంజీవరెడ్డి, ఐకాస రాష్ట్ర, జిల్లా నాయకులు పోల్సాని పీతాంబరరావు, యాళ్ల వెంకట్ రెడ్డి, మర్రి రాజిరెడ్డి, జనగామ దేవేందర్ రావు, పారిపెల్లి రాజిరెడ్డి, సంగసాని లింగారెడ్డి, కొక్కిరాల శ్రీనివాస్ రావు, గాజర్ల మల్లా రెడ్డి, కొత్త వెంకట్ రెడ్డి, దేవరాజుల మనోహర్ శర్మ, గర్రెపల్లి శంకర్ లింగం తదితరులు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

శంకరపట్నం మండల కేంద్రములో నిర్వహించిన ఓసి జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సభ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడుతున్న పోలాడి రామారావు..

మానకొండూర్ మండల కేంద్రములో ఓసి జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సభ, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రామారావు, నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!