Social 1080×1350 • Multi-page
01-02-2026 BREAKING NEWS 04:50 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలి.- DTF డిమాండ్

విద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలి.- DTF డిమాండ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ DTF మండల వార్షిక కౌన్సిల్ సమావేశం స్థానిక ZPHS బాలికల పాఠశాలలో DTF మండల అధ్యక్షులు బండ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించాలని, కామన్ స్కూల్ సిస్టం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పిఆర్సి నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. DTF జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ రిటైర్మెంట్ పొందిన ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే మంజూరు చేయాలి పెండింగ్ లోఉన్న DA మంజూరు చేయాలని కోరారు. హుజురాబాద్ డిటిఎఫ్ జోన్ కన్వీనర్ ఎస్. చక్రధర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్యలను, ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ మినహా యింపును ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో DTF జిల్లా కార్యదర్శి A శ్రీనివాస్, ఆడిట్ కమిటీ కన్వినర్ U శంకర్, విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షలు వేల్పుల రత్నం, రాష్ట్ర కౌన్సిలర్ సదానందం, సీనియర్ నాయకులు CH మల్లేశం, B రమేష్ లతో పాటు 50కి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న నాయకులు

నూతన డిటిఎఫ్ హుజురాబాద్ మండల శాఖ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డిటిఎఫ్ హుజూరాబాద్ మండల శాఖ అధ్యక్షులుగా భేతీ తిరుపతిరెడ్డి SA (ENGLISH) ZPHS పెద్ద పాపయ్యపల్లి, ప్రధాన కార్యదర్శిగా కనకం వెంకటస్వామి ఎస్జీటీ MPPS తెనుగువాడ, ఉపాధ్యక్షులుగా CH. మహేందర్రెడ్డి SGT, పద్మశ్రీ SA(Phy Sci), ఎస్ విక్రమ్SA(Maths) జి ఆంజనేయులు SGT కార్యదర్శులుగా ఏం రాజేష్ SGT, ఎం వేణు SGT, ఎల్ శ్రీనివాస్SA(Eng) ఏం సత్యరాజం SGT, జిల్లా కౌన్సిలర్లుగా పి ఈశ్వర్ రెడ్డి, ఎస్ చక్రధర్, వి శంకర్, ఎ శ్రీనివాస్, బి శ్రీనివాస్, జి చిరంజీవి, జి వెంకట్రాజన్, బి వీరన్న నాయక్, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా పి. రాజిరెడ్డి, సభ్యులు s. మేఘన, R. భాస్కర్, ఎన్నికల అధికారి చక్రధర్, ఎన్నికల పరిశీలకులు వి.రత్నం పాల్గొన్నారు.

అధ్యక్షుడు. B. తిరుపతి రెడ్డి(పైన వ్యక్తి), ప్రధానకార్యదర్శి k వెంకటస్వామి(కిందివ్యక్తి)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!