Social 1080×1350 • Multi-page
02-02-2026 BREAKING NEWS 08:42 PM
swarnodayam.com
Telugu Daily News

26వ వార్డులో లావణ్య విస్తృత ప్రచారం.. బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు.

26వ వార్డులో లావణ్య విస్తృత ప్రచారం.. బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు.
IMG_20260202_203703

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో ప్రముఖ వ్యాపార కూడలి అయిన 26వ వార్డులో తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డిలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 26వ వార్డులో 💯 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేయడం ద్వారా మున్సిపల్ లోనే రికార్డు సృష్టించిన కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డిలు అదే స్పూర్తిగా ప్రతి ఓటరులను వ్యక్తి గతంగా కలుస్తూ ప్రచారంలో దూసుకుపోతుండగా ఓటర్లు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 30 వార్డులల్లో 26 వార్డులో లావణ్య విజయం సాధిస్తారనే ప్రచారం ఉంది. ప్రతి పార్టీతో పాటు ఇంటలిజెన్స్ నివేదికలు కూడా ఆయా పార్టీలకు నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ లావణ్య గెలుపును అక్కడ ఎవ్వరూ నిలువరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. మూడు సార్లు వార్డులో 500లకు పై చిలుకు ఓట్లు తెచ్చుకుంటూ ప్రజల సహకారంతో సునాయసంగా గెలుస్తున్న లావణ్య – నర్సింహారెడ్డిలు ఈ సారి నాల్గవ సారి బీజేపీ, కాంగ్రెస్ లకు దీటుగా బీఆర్ఎస్ పార్టీపై ప్రచారంలో ముందున్నారు. 26 వార్డులో సూపర్ బజార్ రోడ్డు, ఆయా వార్డుల్లో సీసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ, మిషన్ భగీరథ, పింఛన్లు, రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మీ, సిఎంఅర్ఎఫ్ తదితర ఎన్నో పథకాలు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ పనులు ప్రజలకు సేవలు అందించడంలో సాటి , ప్రతి కుటుంబములో ఒక సభ్యుడిగా ఉండే లావణ్య భార్య, భర్తలు ప్రతి ఓటర్, వార్డు ప్రజలకు చేరువై ప్రచారంలో ముందు వరసలో దూసుకుపోతున్నారు. వార్డులో 💯 శాతం పనులు చేపట్టి, సేవలు చేసిన లావణ్య నర్సింహారెడ్డికి ఓటర్ల నుండి కూడా మంచి స్పందన వస్తోంది. నాలుగు సార్లు గెలిచి గ్రామ, మున్సిపల్ లో ఏకైక వార్డు సభ్యురాలుగా వార్డు నుండి రికార్డు సృష్టించి ప్రజలకు అంకితం చేయాలని భావిస్తున్నారు. ఏదేమైనా హుజూరాబాద్ లో 26వ వార్డు సభ్యురాలు కేసిరెడ్డి లావణ్య భారీ మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించే అవకాశం ఉంది. వారి ప్రచారానికి వాడ ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉండడంతో వారి గెలుపును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదంటూ ప్రచారం జరుగుతుంది.

26వ వార్డు సూపర్ బజార్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థిని కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి..

ప్రచారంలో దూసుకుపోతున్న బిఆర్ఎస్ అభ్యర్థిని కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!