03-02-2026 NORMAL NEWS 08:15 PM
swarnodayam.com
Telugu Daily News
03-02-2026 08:15 PM By Mandala Yadagiri

హుజురాబాద్ మున్సిపాలిటీలో 143 మంది పోటీ.. – ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే పోటీ.

హుజురాబాద్ మున్సిపాలిటీలో 143 మంది పోటీ.. – ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే పోటీ.
IMG_20260203_201201

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 11న హుజురాబాద్ మున్సిపాలిటీకి జరిగే రెండవ సాధారణ ఎన్నికల్లో 33 మంది ఉపసంహరణ చేసుకున్న తర్వాత 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎన్నికల సహాయ అధికారి(మునిసిపల్ కమిషనర్) సయ్యద్ ముసబ్ అహ్మద్ తెలిపారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, బిఎస్పి, ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 143 మంది పోటీ పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.
మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల్లో
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో 30 వార్డ్ లకు గాను 143 మంది కౌన్సిలర్లు పోటీ చేస్తున్నారు.
బీజేపీ – 30
బిఆర్ఎస్ – 30
ఇండియన్ కాంగ్రెస్ – 30
ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ – 07
జన సేన – 02
ఇండిపెండెంట్ – 39
ఇతరూలు – 03
మొత్తం 143

కాగా ప్రధానంగా మూడు పార్టీల మధ్యనే హోరా హోరీగా పోటీ ఉన్నట్లుగా పలువురు భావిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు మళ్లీ గెలుస్తామన్న ధీమా ఉండగా ఓటర్ల ఆశీర్వాదం పాతవారికి ఉందా కొత్తవారికి ఉందా అనేది 13న ఓట్ల కౌంటింగ్ రోజు తెలియనున్నది.

Oplus_16908288

ఎన్నికల సహాయాధికారి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!