04-02-2026 NORMAL NEWS 10:25 PM
swarnodayam.com
Telugu Daily News
04-02-2026 10:25 PM By Mandala Yadagiri

ఓసిల హక్కుల సాధనకు 23న ఓసిల మహాధర్నాకు చలో ఢిల్లీ. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు.

ఓసిల హక్కుల సాధనకు 23న ఓసిల మహాధర్నాకు చలో ఢిల్లీ. – ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు.
IMG-20260204-WA0079

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఓసిల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈనెల 23న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయస్థాయి ఓసిల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
బుధవారం హిమాయత్ నగర్ వెలమ సంఘం కార్యాలయంలో ఓసి జేఏసీ రాష్ట్ర జిల్లా యువజన నాయకులతో కలిసి ఈనెల 23న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఓసిల మహా lధర్నా విజయవంతం చేయాలని ఓసి జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ
దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రకుల పేద సామాజిక వర్గాలలోని పేద విద్యార్థినీ విద్యార్థులు , రైతులు , మహిళలకు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ విషయాల్లో జరుగుచున్న అన్యాయాన్ని పరిష్కరించుకునే దిశగా అన్ని వర్గాల ప్రజల పక్షాన దేశం నడి ఒడ్డున జరుగుచున్న ఈ మహాధర్నా కార్యక్రమాన్ని యువకులు, మహిళలు విద్యార్థినీ విద్యార్థుల భారీ సమూహంతో డిల్లీలో కదం తొక్కి విజయవంతం చేద్దామని, ధర్నా నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కను విప్పు కలిగే విధంగా ఉంటుందని పోలాడి రామారావు తెలియజేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసిల స్థితి గతుల అధ్యయనానికి ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతుల్లేని 5 ఏండ్ల కాలపరిమితి కలిగి ఉండాలని, ఈడబ్లూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఉపాధి పథకాలను ఓసి యువతకు వర్తింప చేయాలని, ప్రస్తుతం 50 శాతం పెంచకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించే భాగస్వామ్యం ఉండే చట్టం తేవాలని, రైతులకు రైతు భీమా వర్తించే పరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ నెల 23న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయస్థాయిలో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఓసిల మహాధర్నాకు యువకులు విద్యార్థినీ విద్యార్థులు రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పోలాడి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మంచాల బాల చైతన్య, ప్రథాన కార్యదర్శి ఉమ్మెంతుల సంజీవరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ కనపర్తి సాయికృష్ణ, ప్రథాన కార్యదర్శి గూడూరి చైతన్యరెడ్డి, పొలసాని అనిరుధ్ రావు, సోమేశ్వరరావు, మాధవరం పవన్ రావు, వర్దినేని నవనీత్ రావు, బచ్చు రాజేశ్వర్, భరత్ కుమార్, బండ సుధాకర్ రెడ్డి, గోపు శ్యాంసుందర్ రెడ్డి సంతోష్ శర్మలతో పాటు వివిధ జిల్లాల యువజన విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న జాతీయ అధ్యక్షుడు రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!