Social 1080×1350 • Multi-page
05-02-2026 BREAKING NEWS 09:06 PM
swarnodayam.com
Telugu Daily News

సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. -ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. -ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260205_210234

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఒక ఓసి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జాతి నెపమున కించపర్చుతూ వారి మనోభావాలను అగౌరపర్చుతూ ఓసిల ఐక్యతకు గొడ్డలి పెట్టులా మారిన బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన బాధ్యతా రాహిత్యపు అనుచిత వ్యాఖ్యలను ఓసి ఐకాస తరపున తీవ్రంగా ఖండిస్తూ ఆయన బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నాయకులతో కలిసి పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
గురువారం కరీంనగర్ లో ఐకాస నాయకులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ సిఎం రేవంత్ వ్యాఖ్యలు దిగజారుడు ఓటు బ్యాంక్ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. తాజా మాజీ సిఎం పై మీకు రాజకీయ వైరుధ్యాలు ఉండటాన్ని మేము తప్పు పట్టడం లేదు అది రాజకీయాల్లో మీరు మీరు క్షేత్ర స్థాయిలో విది విధానాల మీద హుందా తనంగా సద్ విమర్శలు చేసుకోండి, కానీ అదే సామాజిక వర్గీయులైన ఇతర మాజీ ప్రజా ప్రతినిధులతో సహా వారి జాతి మొత్తాన్ని కించపరిచే సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు సరి కాదు. ఇదే ముఖ్యమంత్రి ఉన్న పార్టీ లో పెద్దలు దివంగత మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిలు సీఎంలుగా భేషుగ్గా అందరిని కలుపుకొని పరిపాలన సాగించి మన్ననలు పొందారన్నారు.
మరో మైనారిటీ ఓసి సామాజిక వర్గానికి చెందిన పెద్దలు దివంగత నేత పీవీ నరసింహారావు ఉమ్మడి ఏపీ సీఎం గా దేశ ప్రధానిగా పరిపాలన సాగించి మన్ననలు పొండలేదా, పెద్దలు దివంగత మహానేత జువ్వాడి చొక్కారావు, చలిమెడ ఆనందరావు, దివంగత నేతలు సుధాకర్ రావు, పురుషోత్తం రావు, చకిలం శ్రీనివాస్ రావు లు మంత్రులుగా హుందాగా వ్యవహరించారని, ప్రజా క్షేత్రంలో దివంగత నేత వెలిచాల జగపతిరావు లాంటి నేతల వైఖరి భేష్ అని తెలంగాణ ప్రజలు మెచ్చుకోలేదా అప్పుడు మీరెక్కడ ఉన్నారు మిస్టర్ సిఎం రేవంత్ రెడ్డి సర్, ఇంతెందుకు గతంలో మీరు కొన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ప్రముఖ మైనదని పొగిడిన సందర్భాలు ఉన్నాయి
ఒక వైపు మేమంతా ఓసిల ఐక్యతకు పాటు పడుతూ ఓసియేతరలను కూడా మన న్యాయమైన డిమాండ్లకు మద్దతు కూడ గడుతూ డిమాండ్ల సాధనకు సంఘటితంగా దేశ రాజధాని నడి ఒడ్డున పోరాటం చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతి పేరుతో ఆ సామాజిక మొత్తం వర్గాన్ని కించపరిచే బాధ్యతా రాహిత్య వైఖరి వల్ల ఆ సామాజిక వర్గీయులకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని రామారావు ఆరోపించారు. గతంలో కూడా అనేక సార్లు జాతి నెపంతో కించపరిచే బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ సీఎం పదవి కుర్చీకే తలవంపులు తెచ్చారని మండి పడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించాలని లేకుంటే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐకాస రాష్ట్ర నాయకులు అండెం రమణారెడ్డి. కొత్తకొండ రవీందర్ రావు, చీటి రవీందర్ రావు, ద్యావనపల్లి రాంకిషన్ రావు, జిల్లా అంజయ్య, విక్రమ్ నరసింగారావు, తీగల లక్ష్మణ్ రావు, తోపు శ్రీనివాస్, గడ్డం తిరుపతిరెడ్డి తదితరులతో కలిసి ఓసి ఐకాస జిల్లా నాయకులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

Oplus_16908288
Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!