07-02-2026 NORMAL NEWS 10:18 PM
swarnodayam.com
Telugu Daily News
07-02-2026 10:18 PM By Mandala Yadagiri

20వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఏసీ జోరు.

20వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఏసీ జోరు.
IMG_20260207_221514

మాచర్ల వనమాల కొడుకు నరేష్ ఇంటింటి ప్రచారం.. మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి.

20వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు..గెలుపు దశలో ముందంజ..ఏసీ గుర్తు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 07: హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా 20వ వార్డులో బరిలోకి దిగిన మాచర్ల వనమాల(నరేష్) ఇంటింటి ప్రచారం చేస్తూ.. మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి అని వేడుకొంటున్నారు. వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నామన్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాచర్ల వనమాల (ఇండిపెండెంటూ) అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మాచర్ల వనమాల కుమారుడు మాచర్ల నరేష్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఎదిగి ప్రజల మెప్పు పొందారు. వారు ఆశించిన కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. వారి గుర్తు ఏసీ గుర్తు రాగా ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఎలాగైనా గెలిచి చూపించాలని పట్టుదలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. మాచర్ల నరేష్ మాట్లాడుతూ.. కష్టపడే వారికి టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని తన ఆవేదన వ్యక్తం చేశారు. 20 వార్డులో ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలు తనను గెలిపిస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చాడు. అలాగే వార్డు ప్రజలు మమ్ములను ఆదరించి ఆశీర్వదించి ఏసీ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని 20వ వార్డు ప్రజలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.

గడపగడపకు తిరుగుతూ కరపత్రాలు పంచి ఓటు అభ్యర్థిస్తున్న మాచర్ల వనమాల, ఆమె కొడుకు నరేష్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!