Social 1080×1350 • Multi-page
07-02-2026 BREAKING NEWS 11:33 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రచారంలో దూసుకుపోతున్న 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్లూరి శ్రీలేఖ.

ప్రచారంలో దూసుకుపోతున్న 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్లూరి శ్రీలేఖ.
IMG-20260207-WA0143

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వడ్లూరి శ్రీలేఖ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉండాలని శ్రీలేఖ కోరారు.
అధికారంలో లేని పార్టీలకు ఓటు వేస్తే ఓటు వృధా అవుతుందని, అభివృద్ధి కుంటు పడుతుందని శ్రీలేఖ అన్నారు.
ప్రజా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, ప్రజా పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఏక కాలంలో రైతు రుణమాఫీ, ప్రతి పంటకు రైతు భరోసా, పంట బోనస్ లాంటి అనేక పథకాలను ప్రజలకు అందిస్తన్నా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు 22వ వార్డుకు సంబంధించి, 12 సూత్రాల హామీలను ప్రకటించి శ్రీలేఖ ముందుకు వెళ్తున్నారు. గతంలో తన తండ్రి వడ్లూరి విజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ గా పట్టణాభివృద్ధికి చేసిన అభివృద్ధి కంటే తాను గెలిస్తే రెట్టింపు అభివృద్ధి 22వ వార్డులో చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నట్లు శ్రీలేఖ పేర్కొన్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

గడపగడపకు ప్రచారం చేస్తూ దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీలేఖ..

అన్ని వర్గాల వారిని కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్న 22వ వార్డ్ అభ్యర్థి వడ్లూరీ శ్రీలేఖ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!