Social 1080×1350 • Multi-page
08-02-2026 BREAKING NEWS 12:02 AM
swarnodayam.com
Telugu Daily News

22వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి శ్యామలకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు.. – ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి శాలినిరెడ్డి.

22వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి శ్యామలకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు.. – ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి శాలినిరెడ్డి.
IMG-20260207-WA0151

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల- హరిప్రసాద్ (మనిషా స్టూడియో) కి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 22వ వార్డులో శనివారం ఇంటింట ప్రచారానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలినిరెడ్డి హాజరై ప్రచారం నిర్వహించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏలాంటి అభివృద్ధి పని చేపట్టిన దాఖలాలు లేవని వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నామన్నారు. తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో వర్తింపజేయడంతో పాటు వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెడతా మన్నారు. 22వ వార్డు ఓటర్లు ఎంతో చైతన్య వంతులని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజమైన ప్రగతి కాముకులను గుర్తించి ఓటు వేస్తారు అనీ ధీమా వ్యక్తం చేశారు. కాకతీయ కాలనీ, గుప్తా అపార్ట్మెంట్ ఏరియా, కాకతీయ కళాశాల వాడలో ఎక్కడికి వెళ్లినా ఓటర్లు తమకు అండగా నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 22వ వార్డు ఓటర్లు అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తమను గిఫ్ట్ గా అందించాలని దానికి ప్రతిఫలంగా వాడను అన్ని రంగాలలో ముందు వరుసలో నిలిపి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనీ శ్యామల- ప్రసాద్ తెలిపారు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయ బంధువులు పాల్గొన్నారు.

22వ వార్డులో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి శాలినిరెడ్డి, ప్రచారంలో పాల్గొన్న ఆ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల- హరిప్రసాద్..

ఓటర్లకు తమను గెలిపిస్తే చేసే ప్రగతి నివేదిక కరపత్రాలు పంచుతూ ఓటు అభ్యర్థిస్తున్న శ్యామలహరి ప్రసాద్..

యువకుడు, వృద్ధురాలును తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న శ్యామల -హరిప్రసాద్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!