Social 1080×1350 • Multi-page
08-02-2026 BREAKING NEWS 07:17 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రచారంలో గెలుపు బాటలో దూసుకుపోతున్న 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్జపల్లి వెంకటేశ్వర్లు(కిట్టు).

ప్రచారంలో గెలుపు బాటలో దూసుకుపోతున్న 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్జపల్లి వెంకటేశ్వర్లు(కిట్టు).
IMG-20260208-WA0037

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వజ్జపల్లి వెంకటేశ్వర్లు(కిట్టు) ప్రచారంలో గెలుపు దిశగా దూసుకెళ్తున్నాడు.
అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉండాలని వెంకటేశ్వర్లు(కిట్టు) కోరారు.
అధికారంలో లేని పార్టీలకు ఓటు వేస్తే ఓటు వృధా అవుతుందని, అభివృద్ధి కుంటు పడుతుందని కిట్టు పేర్కొన్నారు.

అహల్య నగర్ లో ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్లు

ప్రజా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, ప్రజా పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఏక కాలంలో రైతు రుణమాఫీ, ప్రతి పంటకు రైతు భరోసా, పంట బోనస్ లాంటి అనేక పథకాలను ప్రజలకు అందిస్తన్నా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు 14వ వార్డుకు సంబంధించి, 12 సూత్రాల హామీలను ప్రకటించివజ్జపల్లి వెంకటేశ్వర్లు(కిట్టు) ముందుకు వెళ్తున్నారు. గతంలో గెలిచిన కౌన్సిలర్ వార్డు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని, తానను గెలిస్తే అభివృద్ధి అంటే ఏమిటో 14వ వార్డులో చేసి చూపిస్తానని హామీ ఇస్తు వజ్జపల్లి వెంకటేశ్వర్లు(కిట్టు) ప్రచారంలో ముందుకు సాగారు. ప్రతి వాడవాడకు సిసి రోడ్డులు వేయడం, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా చూడడం, అహల్య నగర్, సిద్ధార్థనగర్ కాలనీలో అంతర్గత సిసి రోడ్లు, మురుగు కాలువలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తెలుగువాడ, కిందివాడలల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు ప్రత్యేక సిసి రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేసి వార్డు రూపురేఖలను మార్చి వేయడం జరుగుతుందన్నారు. తనకు ఒక్కసారి కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వాలని కిట్టు వేడుకున్నారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఓటర్లు వాటినీ తిప్పి కొట్టి, నీతి నిజాయితీతో సేవ చేసేందుకు వచ్చిన తనను గెలిపించాలని, తన చేతి గుర్తుపై ఓటు వేయాలని వజ్జపల్లి వెంకటేశ్వర్లు(కిట్టు) అభ్యర్థించారు.

గడపగడపకు ప్రచారంలో భాగంగా ఆహల్యనగర్ లో కాలినడకన తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు అభ్యర్థి వజ్జపల్లి వెంకటేశ్వర్లు (కిట్టు)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!