Social 1080×1350 • Multi-page
09-02-2026 BREAKING NEWS 11:52 PM
swarnodayam.com
Telugu Daily News

22వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే.. – భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు పిలుపు

22వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే.. – భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు పిలుపు
IMG-20260209-WA0148

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 22వ వార్డులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్లూరి శ్రీలేఖని భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

వడ్లూరి శ్రీలేఖ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకురాలిగా పనిచేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

22వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థిస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీలేఖ తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!