Social 1080×1350 • Multi-page
11-02-2026 BREAKING NEWS 07:51 PM
swarnodayam.com
Telugu Daily News

అమెరిక, సింగపూర్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న యువతి యువకుడు..

అమెరిక, సింగపూర్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న యువతి యువకుడు..
IMG-20260211-WA0052

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని దృక్పథంతో ఓ జంట ఖండాలు దాటి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఓటుకున్న ప్రాధాన్యతను మరింతగా పెంచింది. వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ బీసీ కాలనీ 12వ వార్డుకు ఆర్ దేవేందర్ రెడ్డి కుమారుడు చెందిన ఆర్ మధుకర్ రెడ్డి అమెరిక నుండి రాగా కుమార్తె మానస సింగపూర్ నుండి వచ్చి ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించి పది రోజుల ముందుగానే అమెరికా, సింగపూర్ నుండి బయలుదేరి తమ స్వగ్రామం హుజూరాబాద్ ఇందిరానగర్ బీసీ కాలనీ చేరుకున్నారు. ఈరోజు కరీంనగర్ మెయిన్ రోడ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 41వ బూతులో తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటుకు ఉన్న ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను నేటి తరానికి చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు. ఎల్లలు దాటి ఖండాలు దాటి ఓటు హక్కు వినియోగం కోసం స్వగ్రామం వచ్చి ఇద్దరు యువతి, యువకుడు మధుకర్ రెడ్డి మానసలు ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

అమెరికా నుండి వచ్చిన 12వ వార్డుకు చెందిన యువ దంపతులు ఆర్ మధుకర్ రెడ్డి- మానస దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చూపుతున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!