Social 1080×1350 • Multi-page
12-02-2026 BREAKING NEWS 09:08 PM
swarnodayam.com
Telugu Daily News

ఓసిల మహాధర్నాకు మద్దతివ్వండి.. -మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందించిన పోలాడి రామారావు.

ఓసిల మహాధర్నాకు మద్దతివ్వండి.. -మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందించిన పోలాడి రామారావు.
IMG_20260212_210622

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఓసిల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23న డిల్లీలో జాతీయస్థాయి ఓసిల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.ఈ మేరకు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహా ధర్నాకు మద్దతు తెలపాలని గురువారం మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డిని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కోరుతూ గురువారం ఆహ్వాన పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని ఆర్ధికంగా వెనుక బడి ఉన్నవారు రిజర్వేషన్లు లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసిలకు తీవ్ర అన్యాయం జరిగి అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద ఓసి లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జనరల్ స్థానాల్లో సైతం ఓసిలు తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 16డివిజన్లు జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా 12చోట్ల ఓసిలు పోటీ చేయలేక పోయారన్నారు. జనరల్ స్థానాల్లో కూడా ఓసిలకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వక పోవడం వల్ల రాజకీయంగానూ వెనుక బడి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్నవారికి చేయూతనిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే వాటిపైనా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేందుకు జాతీయ ఈడబ్ల్యూఎస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. కొద్ది సేపటి క్రితం హుజూరాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబును సింగాపూర్ లోని వారి నివాసంలో పోలాడి రామారావు కలిసి ఈనెల 23న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసిల మహా ధర్నా ఏర్పాట్లపై వివరించి సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను ప్రణవ్ కు పోలాడి రామారావు అందజేయగా సానుకూలంగా స్పందించారని ఓసి జేఏసీ తరపున ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందజేస్తున్న జాతీయ అధ్యక్షుడు పోరాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!