Social 1080×1350 • Multi-page
13-02-2026 BREAKING NEWS 10:35 AM
swarnodayam.com
Telugu Daily News

పోస్టల్ ఓటు వేయడంలో ఉద్యోగుల నిర్లక్ష్యం.. చెల్లకుండా పోయిన రెండు ఓట్లు.. – 30 వార్డుల్లో పోలైన 241 పోస్టల్ ఓట్లు..

పోస్టల్ ఓటు వేయడంలో ఉద్యోగుల నిర్లక్ష్యం..  చెల్లకుండా పోయిన రెండు ఓట్లు.. – 30 వార్డుల్లో పోలైన 241 పోస్టల్ ఓట్లు..
IMG_20260213_103355

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అక్షరాస్యులు అయిన ఉద్యోగులు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవడంలో సైతం విఫలమయ్యారు. ఎంతో జాగ్రత్తగా వేయాల్సిన పోస్టల్ ఓటును నిర్లక్ష్యంతో చెల్లకుండా వేయడం పలు విమర్శలకు తావిస్తుంది. హుజురాబాద్ 30 వార్డుల పరిధిలో మొత్తం 241 పోస్టల్ ఓట్లు పోలవగా.. ఇందులో 20వ వార్డు నుండి ఒకటి, 29వ వార్డు నుండి ఒకటి చేల్లని పోస్టల్ ఓటు రావడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. అధికారులే చల్లకుండా ఓటు వేయడం అంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..

30 వార్డులలో పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో కాంగ్రెస్కు నాలుగు, టిఆర్ఎస్కు ఒకటి, రెండో వార్డులో కాంగ్రెస్కు ఒకటి, టిఆర్ఎస్కు రెండు, మూడో వార్డులో టిఆర్ఎస్కు ఆరు, నాలుగో వార్డులో కాంగ్రెస్ మూడు టీఆర్ఎస్ 4, ఐదో వార్డులో బిజెపి ఒకటి, యాపిల్ గుర్తుకు ఒకటి, ఆరో వార్డులో టిఆర్ఎస్ 3, బిజెపి 1, ఏడో వార్డులో కాంగ్రెస్ ఎనిమిది, టిఆర్ఎస్ ఐదు, బిజెపి 8, ఎయిర్ కండిషనర్ కు మూడు, ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ ఒకటి, బిఆర్ఎస్ రెండు, తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ రెండు, పదో వార్డులో కాంగ్రెస్ నాలుగు, బిజెపి ఒకటి, 11వ వార్డులో బిజెపి రెండు, కాంగ్రెస్ ఒకటి, 12వ వార్డులో కాంగ్రెస్ ఒకటి, టిఆర్ఎస్ నాలుగు, కోటు మూడు, ఏఐఎఫ్బి ఓ కటి, గౌను 3, 13వ వార్డులో ఒక ఓటు కూడా నమోదు కాలే.. 14వ వార్డులో కాంగ్రెస్ 4, బిజెపి 3, 15వ వార్డులో కాంగ్రెస్ 12, టిఆర్ఎస్ ఒకటి, 16వ వార్డులో కాంగ్రెస్ రెండు, 17వ వార్డులో కాంగ్రెస్ నాలుగు, టిఆర్ఎస్ మూడు, 18 వ వార్డులో కాంగ్రెస్ ఒకటి, టిఆర్ఎస్ మూడు, బిజెపి ఒకటి, 19వ వార్డులో కాంగ్రెస్ ఒకటి, టిఆర్ఎస్ ఒకటి, ఏసీ 1, గౌను ఒకటి, 20వ వార్డులో కాంగ్రెస్ ఒకటి, ఏఐఎఫ్బి ఒకటి, ఏసీకి ఒకటి, టిఆర్ఎస్ ఒకటి, బిజెపి 11, ఫ్రాక్ ఒకటి, చేల్లని ఓటు ఒకటి, 21వ వార్డులో కాంగ్రెస్ 4 బిజెపి 3, టిఆర్ఎస్ ఒకటి, 22 వార్డులో కాంగ్రెస్ 4, టిఆర్ఎస్ 8 బిజెపి 1, 23వ వార్డులో బిఆర్ఎస్ 5, బిజెపి 1, 24 వ వార్డులో కాంగ్రెస్ 2, 25వ వార్డులో కాంగ్రెస్ 2, బిజెపి 14, బిఆర్ఎస్ ఆరు, క్యారం కు 1, 26వ వార్డులో కాంగ్రెస్1, టిఆర్ఎస్కు నాలుగు, బిజెపికి మూడు, 27 వార్డులో కాంగ్రెస్ 3, టిఆర్ఎస్కు మూడు, 28 వార్డులో కాంగ్రెస్ 4, టిఆర్ఎస్కు రెండు, బిజెపికి నాలుగు, ఏఐ ఎఫ్బి రెండు, 29 వార్డులో బిజెపి రెండు, టిఆర్ఎస్కు 3, కాంగ్రెస్ రెండు, ఏఐఎఫ్బికి ఒకటి, జనసేనకు ఒకటి, రింగుకు ఒకటి, చేల్లని ఓటు ఒకటి, 30 వ వార్డులో కాంగ్రెస్ 18, టిఆర్ఎస్కు ఒకటి, బిజెపికి రెండు, యాపిల్ గుర్తుకు నాలుగు చొప్పున ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా ఉండడంతో కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!