13-02-2026 NORMAL NEWS 08:26 PM
swarnodayam.com
Telugu Daily News
13-02-2026 08:26 PM By Mandala Yadagiri

28వ, 16వ వార్డులో సున్నా ఓట్లు తెచ్చుకున్న బి.ఎస్.పి, స్వతంత్ర అభ్యర్థులు.. – 30వ వార్డులో ఒకే ఓటుకే పరిమితమైన స్వతంత్ర అభ్యర్థి.. సింగిల్ డిజిట్ దాటని ఏడుగురు అభ్యర్థులు..

28వ, 16వ వార్డులో సున్నా ఓట్లు తెచ్చుకున్న బి.ఎస్.పి, స్వతంత్ర అభ్యర్థులు.. – 30వ వార్డులో ఒకే ఓటుకే పరిమితమైన స్వతంత్ర అభ్యర్థి.. సింగిల్ డిజిట్ దాటని ఏడుగురు అభ్యర్థులు..
IMG_20260213_103355

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కనీసం ఒక్క ఓటు కూడా తెచ్చుకోకపోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. ఓ వార్డులో వారి ఓట్లు వాళ్లే వేసుకోకపోగా మరో వార్డులో పోటీ చేసిన అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. 28వ వార్డును బీసీ జనరల్ కాగా 958 ఓట్లకు గాను 737 ఓట్లు పోలు కాగా ఒక ఓటు రిజెక్టు, నాలుగు ఓట్లు నోటాకు పడ్డాయి. ఆరుగురు అభ్యర్థులు పోటీ పడగా బీఎస్పీ జాతీయ పార్టీకి చెందిన గరవేన శ్రీకాంత్ ఏనుగు గుర్తుపై పోటీ చేసి ఒక ఓటు సైతం పొందలేకపోయారు. అలాగే 16వ వార్డులో నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థి రావులకారి పద్మకు 0 ఓట్లు రావడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. అందులో కాంగ్రెస్ అభ్యర్థి బండ వెన్నెలకు 371 ఓట్లు రాగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన మారేపల్లి సుశీలకు 307 ఓట్లు రాగా, డి.ఎస్.పి పార్టీపై పోటీ చేసిన మాటూరి మౌనికకు 12 ఓట్లు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థికి 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే తొమ్మిదవ వార్డు(దమ్మక పేట)లో మాజీ సర్పంచ్ అయిన ఇల్లందుల సమ్మయ్య స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఎనిమిది ఓట్లు రావడం పలువురిని ఆలోచింపజేసింది. 11వ వార్డులో పిల్లి రాజు స్వతంత్ర అభ్యర్థికి సైతం ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండవ వార్డులో జాతీయ పార్టీ అయిన ఏఐఎఫ్బి కి చెందిన చింతల మాధవి కేవలం నాలుగు కోట్లకే పరిమితం కాక అదే వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రూహి మహమ్మద్ కు ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏడవ వార్డులో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అందాసి నారాయణకు రెండు ఓట్లు, వేముల చిరంజీవికి ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే 30 వార్డులో 1106 ఓట్లకు గాను ఎనిమిది వందల ఇరవై ఒకటి పోలు కాగా అందులో చెల్లకుండా ఎనిమిది, నోటాకు 8 ఓట్లు పోలయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోంటాల సుహాసిని కి 402 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి ఎర్ర వసంతకు 157 రాగా బిఆర్ఎస్ అభ్యర్థి పుల్లూరు శారదకు 137 స్వతంత్ర అభ్యర్థి జన్ను అన్నపూర్ణకు 98, ఏఐఎఫ్బి అభ్యర్థి కోరపల్లి రచనకు 30, స్వతంత్ర అభ్యర్థి మొలుగూరి స్రవంతికీ కేవలం 5, ముక్క స్రవంతికి కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం పలువురిని విస్మయానికి గురిచేసింది. మొత్తం మీద హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు కనీసం ఒక్క ఓటు కూడా తెచ్చుకోకపోవడం ఏడుగురు వ్యక్తులు సింగిల్ డిజిట్ దాటకపోవడం ఓటర్ చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చుననీ పలువురు భావిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!