Social 1080×1350 • Multi-page
15-02-2026 BREAKING NEWS 08:47 PM
swarnodayam.com
Telugu Daily News

ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలకు తీవ్ర అన్యాయం..-ఓసిలను కించపరిచిన బీసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ క్షమాపణ చెప్పాలి. – ఓసి జేఏసీ డిమాండ్.

ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలకు తీవ్ర అన్యాయం..-ఓసిలను కించపరిచిన బీసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ క్షమాపణ చెప్పాలి. – ఓసి జేఏసీ డిమాండ్.
IMG-20260215-WA0033

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఓసిలను కించపర్చుతూ బీసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసిన అహంకార వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతు క్షమాపణలు చెప్పాలని ఓసి జేఏసీ తరపున
ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసి లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. జనరల్ కు రిజర్వు చేసిన స్థానాల్లోసైతం ఓసిలకు అవకాశాలు ఇవ్వకుండా అన్నీ పార్టీలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తూ ఓసిలను అంటరాని వారీగా చిన్న చూపు చూడడం దారుణమని రామారావు మండి పడ్డారు. రేపు జరగబోయే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ఓసిలకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అవకాశాలను కల్పింఛని రాజకీయ పార్టీలకు ఓసి ఐకాస ఆధ్వర్యంలో తమ సత్తా ఏంటో చూపిస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు. ఓసిలకు కోలుకోని దెబ్బ తలిగి రగిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో ఆయన మాట్లాడుతూ
జనరల్ అంటే రెడ్డి, రావుల రిజర్వేషన్ కాదని బీసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఓసిలను అవహేళన చేసే విధంగా కించపర్చుతూ శనివారం భువనగిరిలో చేసిన వ్యాఖ్యలను ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని రామారావు మండి పడ్డారు. ఓసిలకు స్ధానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కుట్రలకు తెర లేపడంతో ఓసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. మున్సిపల్ వార్డు, డివిజన్ ల రిజర్వేషన్లలో ఓసిలు 70నుంచి 80శాతం ఉన్న చోట బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వు చేశారని ఇక్కడ ఓసిలకు అవకాశం లేకుండా పోయిందని, ఓసియేతరులు 70 నుంచి 80శాతం ఉన్న చోట జనరల్ స్థానాలుగా రిజర్వు చేశారని దీంతో ఇక్కడ ఓసిలకు విజయావకాశాలు లేకుండా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసిలకు అవకాశాలు లేకుండా పాలకులు చేయడంతో ఏదో ఘనవిజయం సాధించామని బీసీ సంక్షేమ సంఘాల నాయకుల విర్రవీగుతూ ఓసిలను అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తక్షణమే తన వ్యాఖ్యలను బీసీ ఐకాస నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉప సంహరించుకొని ఓసి లకు బేషరతు క్షమాపణలు చెప్పాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. తమ ఓసిల సంయమనాన్ని చేతగాని తనంగా అలుసుగా చూడ వద్దని హుందాగా వ్యవహరించాలని కోరారు. ఇటేవలె బాధ్యత గల రాష్ట్ర కేబినెట్ లో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక ప్రజా ప్రతినిధి తనను దారుణంగా అవమానించినా దిగమింగుకుని సంయమనం పాటించానని ఇది తమ సంస్కరాణానికి నిదర్శనమని పోలాడి రామారావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తమ ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు లేవన్నారు. ప్రస్తుత మున్న 50శాతం దాటని రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు.
సమావేశంలో నాయకులు అండెం రమణారెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, తీగల లక్ష్మణ్ రావు, పన్నాల హారీశ్వర్ రెడ్డి, శోభన్ రెడ్డి, రాంకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!