16-02-2026 NORMAL NEWS 07:33 PM
swarnodayam.com
Telugu Daily News
16-02-2026 07:33 PM By Mandala Yadagiri

దశాబ్ధాల తర్వాత హుజూరాబాద్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన కాంగ్రెస్ జెండా…

దశాబ్ధాల తర్వాత హుజూరాబాద్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన కాంగ్రెస్ జెండా…
IMG-20260216-WA0089

ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం..

చైర్మెన్ గా సుహాసిని, వైస్ చైర్మన్ గా అంజలి..

అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం వరకు తనదైన శైలిలో ముద్ర వేసిన ప్రణవ్.

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో పాటు స్థానికంగా ఉన్న వారిని సమన్వయం చేయడంలో సక్సెస్..

హుజురాబాద్ లో చరిత్ర తిరగరాసిన కాంగ్రెస్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా ఎగరవేసింది. కొన్ని దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి విజయ తిలకాన్ని దిద్దారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికలో ఆచుతూచి వ్యవహరిస్తూ, ఈసారి ఎలాగైనా హుజురాబాద్ లో జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉండి విజయ యాత్రను కొనసాగించారు. సోమవారం నాడు హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మెన్ గా రోంటాల సుహాసిని, వైస్ చైర్మన్ గా గూడూరి అంజలి ఎన్నుకున్నారు. అనంతరం జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రణవ్ తో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గెలిచిన సభ్యులను ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రణవ్. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలకు దగ్గరై ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసిందని, ఇకపై హుజురాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని వారు అన్నారు. గెలిచిన కౌన్సిలర్లు మీ సేవలో ఉంటారని ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరింత చేరువ చేస్తామని, సంక్షేమం, అభివృద్ధి మా ప్రధాన ధ్యేయమని అప్పుడు ఎన్నికల్లో చెప్పినట్టు నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేకపోయారని, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగానే జెండా ఎగరవేసినట్టు, వచ్చే ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే విజయం పునరావృతం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఇంతటి మెజారిటీ అందించిన హుజూరాబాద్ ప్రజలకు అటు జమ్మికుంట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నవీన్ యాదవ్, ప్రణవ్. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు.

ప్రమాణస్వీకారం అనంతరం విజయ సంకేతం చూపుతున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్మన్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, పార్టీ ఇంచార్జ్ ప్రణవ్…

ప్రమాణ స్వీకారం అనంతరం ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు వస్తున్నా ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జ్, కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్…

చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సుహాసినికి పూల బొకే ఇచ్చి శాలువా కప్పి సత్కరిస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్..

వాయిస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన గూడూరు అంజలికి పుష్పగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి సత్కరిస్తున్న ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జ్ ప్రణవ్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!