Social 1080×1350 • Multi-page
16-02-2026 BREAKING NEWS 07:50 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ హాకీ పోటీలకు హుజురాబాద్ క్రీడాకారులు

జాతీయ హాకీ పోటీలకు హుజురాబాద్ క్రీడాకారులు
IMG-20260216-WA0021

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఢిల్లీలో ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత సివిల్ సర్వీసుల హాకీ పోటీలకు హుజురాబాద్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ముల్కనూర్ జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో పిఈటిగా పనిచేస్తున్న సాదుల శ్యాంసుందర్ జట్టులో చోటు దక్కించుకోగా, సహకార శాఖలో సీనియర్ పరిశీలకుడిగా ములుగు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మాటూరి రాజేష్ కూడా ఎంపికయ్యారు.
మాటూరి రాజేష్ గతంలో బెంగళూరు, కురుక్షేత్ర, చండీగఢ్, రాయపూర్, రాంచి, భోపాల్, భువనేశ్వర్ నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో జట్టుకు నాయకత్వం వహించి విశేష ప్రతిభ కనబరిచారు. కాకినాడలో జరిగిన పోటీల్లోనూ రాణించి గుర్తింపు పొందారు.ఇద్దరి ఎంపికపై హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, కార్యదర్శి బొడిగె తిరుపతి, బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు.

సాదుల శ్యాంసుందర్, మాటూరి రాజేష్ లు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!