Social 1080×1350 • Multi-page
17-02-2026 BREAKING NEWS 04:08 PM
swarnodayam.com
Telugu Daily News

పార్టీలు కాదన్నా.. పట్టుదలతో విజయతీరాలకు! .. ఏకంగా వైస్ చైర్మన్ పీఠంపై సామాన్యుడు. – రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించేందుకు ఇతడు ఒక ఉదాహరణ!

పార్టీలు కాదన్నా.. పట్టుదలతో విజయతీరాలకు! .. ఏకంగా వైస్ చైర్మన్ పీఠంపై సామాన్యుడు. – రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించేందుకు ఇతడు ఒక ఉదాహరణ!
IMG-20260217-WA0028

–జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ గా ముంతాజ్ అలీ, మొహమ్మద్ (జావేద్) ఎన్నికయ్యారు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పార్టీలు కాదన్నా పట్టుదలతో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓ సామాన్యుడు చేసిన ప్రయత్నమే అతన్ని విజయతీరాలకు చేర్చింది. వివరాలలోకి వెళితే..! జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డుకు చెందిన ముంతాజ్ అలీ ఏడి మహ్మద్ తనకు కౌన్సిలర్ గా టికెట్ కేటాయిస్తే తప్పనిసరిగా గెలిచి తీరుతానని ఎంతో నమ్మకంతో ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వద్దకు వెళ్లి తనకు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా అక్కడ తమ నాయకుడు మాజీ మున్సిపల్ వాయిస్ చైర్మన్ భర్త దేశినీ కోటి ఉన్నాడు ఇవ్వడం కుదరదని నిరాకరించారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా రెండో ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ వద్దకు వెళ్లి తనకు 19 వార్డులో టికెట్ కావాలని అభ్యర్థించాడు. అతడు కూడా ఆదరించకపోవడంతో గత్యంతరం లేక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వద్దకు వెళ్లి తనకు 19వ వార్డు టికెట్ ఇస్తే 100% గెలిచి చూపిస్తానంటూ విశ్వ ప్రయత్నాలు చేశాడు. ముంతాజ్ అలీ, మొహమ్మద్ (జావేద్) తన పట్టుదలను గ్రహించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు.
తనకు రాజకీయ అనుభవం లేకున్నా ప్రజల మద్దతు ఉందంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరాడు.
అందరూ జావిద్ ను తక్కువ అంచనా వేశారు.
కానీ సామాన్యుడిగా ఉన్న జావీద్ వార్డులో ధీటైన వ్యక్తి, అధికార పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి భర్త దేశిని కోటిని ఢీకొన్నాడు. జావిద్ కు 486 ఓట్లు, దేశిని కోటి 381 ఓట్లు వచ్చాయి. 105 ఓట్ల మెజార్టీతో సామాన్యుడిగా పోటీ చేసి అసమాన్యుడైన వ్యక్తిగా భారీ మెజార్టీతో 19 వార్డులో గెలుపొంది అధికార పార్టీ నేతలకు సవాల్ గా మారారు. పార్టీలు కాదన్నా పట్టుదలతో కృషిచేసి విజయ తీరాలకు చేరుకొని ఏకంగా మున్సిపల్ పీఠంపై వైస్ చైర్మన్ గా సీటు అధిరోహించడం జమ్మికుంటలో హాట్ టాపిక్ గా మారింది. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 12, బిఆర్ఎస్ 10, ఇండిపెండెంట్ గా ఒకరు ఏఐఎఫ్బి టికెట్ పై ఇద్దరూ గెలుపొంది బిఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి ఇండిపెండెంట్గా గెలిచిన దిలీప్ కుమార్ ను చైర్మన్ గా నియమించడం సంచలనం కలిగించింది. ముందుగా బిఆర్ఎస్ టికెట్ ఆశించిన దిలీప్ కు బిఆర్ఎస్ టిక్కట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా రెబల్ అభ్యర్థిగా 23వ వార్డులో పోటీ చేసి తను గెలవడమే కాక తన చెల్లెలు 24వ వార్డులో సైతం గెలిపించుకొని తన పట్టు నిలుపు కోవడంతో గెలుపును చైర్మన్ పీఠం అధిరోహించేలా చేసింది. కాంగ్రెస్ శిబిరంకు వెళ్లిన దిలీప్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపాడుకోలేకపోయారు. చైర్మన్ గా గెలిచే బలమున్న చేజాతులారా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని పోగొట్టుకున్నామని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీల నాయకులు ఇప్పటికైనా డబ్బు, పలుకుబడి చూసి టికెట్లు కేటాయించడం కాకుండా వ్యక్తిత్వాన్ని, వ్యక్తికి ప్రజలతో ఉన్న సంబంధాన్ని గుర్తించి నిజమైన సేవకులకు టికెట్లు ఇస్తే గెలుస్తారని గ్రహించి భవిష్యత్తులోనైనా పదవులను చేజారకుండా కాపాడుకోవాలని ఓటర్లు చురకలాంటిస్తున్నారు.

Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288

ఎన్నికల ప్రచారంలో తనదైన రీతిలో ఓటు అభ్యర్థిస్తున్న ముంతాజ్ అలీ, మొహమ్మద్ (జావేద్)

వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డినీ కలిసిన ముంతాజ్ అలీ, మొహమ్మద్ (జావేద్)

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముంతాజ్ అలీ, మొహమ్మద్ (జావేద్) కు పూల మొక్క ఇచ్చి అభినందనలు తెలుపుతున్న కేటీఆర్, కౌశిక్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!