Social 1080×1350 • Multi-page
20-02-2026 BREAKING NEWS 07:50 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – డిపో ఎదుట పోస్టర్ ఆవిష్కరణ.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – డిపో ఎదుట పోస్టర్ ఆవిష్కరణ.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలువురు ఆర్టీసీ కార్మిక సంఘ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం హుజురాబాద్ ఆర్టీసీ బస్ డిపో ముందు చలో సెక్రటేరియట్ ధర్నా పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 24వ తేదీ మంగళవారం
చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనీ,
2021 సంవత్సరం ఉద్యోగుల పే స్కేల్ ను పర్మనెంట్ 30 శాతం అమలుపరచాలి మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి అని అన్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలనీ, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనీ, రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలనీ అని అన్నారు. సమస్యల సాధనకు తలపెట్టిన
చలో సెక్రటేరియట్ ను అధిక సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ టీఎస్ సింగ్,
కో చైర్మన్ సాధుల కిషోర్, నాయకులు అంబాల రాజు, పి.రాంబాబు ఏం. అశోక్, కే.వెంకన్న, వి తిరుపతి, జి.వీరయ్య, సి.హెచ్ కమలాకర్, జి.శ్రీనివాస్, పి.యాదగిరి, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!