21-02-2026 NORMAL NEWS 08:10 PM
swarnodayam.com
Telugu Daily News
21-02-2026 08:10 PM By Mandala Yadagiri

చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి.. – వాణినికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ దేవరాజు వెంకటరావు

చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి.. – వాణినికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ దేవరాజు వెంకటరావు
IMG_20260221_200659

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: చిన్న తరహా పరిశ్రమల స్థాపన చాలా సులభమని, వాటి స్థాపనకు ముందుకు రావాలని వాణినికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ దేవరాజు వెంకటరావు అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంట్రీ ఫ్యునర్షిప్ డెవలప్మెంట్ సెల్ మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సి.ఐ.టి.డి) కరీంనగర్ వారు సంయుక్తముగా నిర్వహించిన ఎంట్రీ పీనర్ షిప్ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న తరహా పరిశ్రమల స్థాపనలో మెలకువలను వివరించారు. మన చుట్టూ ఉండే వ్యక్తులు చిన్నతరహా పరిశ్రమలను స్థాపించి ఎంతో అభివృద్ధి చెందారని పలు ఉదాహరణలతో వివరించారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాపార రంగంలో సేవా రంగంలో పరిశ్రమల రంగంలో పలు విధములుగా చిన్న తరహా పరిశ్రమలను స్థాపించ వచ్చన్నారు. ఉదాహరణకు కంప్యూటర్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోపాటు ఇతర విషయంలో పరిశ్రమలను ప్రారంభించవచ్చునని వివరించారు. విద్యార్థులు తమకు ఇష్టం ఉన్న రంగంలో పరిశ్రమను స్థాపించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు పరిశ్రమల స్థాపనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. యువత ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం వారు ఆర్థిక సహాయాన్ని పలురూపాలలో అందిస్తారని అన్నారు. పరిశ్రమల స్థాపనకు శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలు ఉన్నాయని అన్నారు స్థాపనకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్తుందని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపన వలన నిరుద్యోగము తగ్గి ఉపాధి పెరుగుతుందని వెంకటరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సెల్(ఈ.డి.సి) కన్వీనర్ మరియు డీన్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎం.వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన కు విద్యార్థులకు కళాశాల లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు, కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు జాతీయస్థాయి మరియు అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు స్థాపించి సమర్థవంతముగా నడుపుతున్నారని వివరించారు. ఈడిసి. కో ఆర్డినేటర్లు అధ్యాపకులు నవీన్ చారి ,కిరణ్ ,అమర్, కె రాజేందర్, అనూష, రాధిక, సుభద్ర, చైతన్య, స్రవంతి, కళాశాల ఇన్నోవేషన్ సెల్ కన్వీనర్ రాజేంద్రప్రసాద్, కళాశాల రిజిస్టర్ డాక్టర్ వి. రాజేశ్వరరావు, డీన్ అకాడమిక్ డాక్టర్ జి మల్లయ్య , అధ్యాపకుడు డాక్టర్ శరత్, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న వాణినికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ దేవరాజు వెంకటరావు

హాజరైన వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!