Social 1080×1350 • Multi-page
22-02-2026 BREAKING NEWS 06:40 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మునిసిపల్ 26వ వార్డులో ఆత్మీయ సమ్మేళనం.. -హాజరైన వార్డు ప్రజలు

హుజురాబాద్ మునిసిపల్ 26వ వార్డులో ఆత్మీయ సమ్మేళనం.. -హాజరైన వార్డు ప్రజలు
Oplus_16908288

–నాలుగోసారి కౌన్సిలర్ గా గెలుపొందిన కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డిని సన్మానించిన వార్డు ప్రజలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 22: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక ఓల్డ్ వెంకటేశ్వర టాకీస్ వాసుదేవ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 26వ వార్డు నుండి బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగో సారి గెలుపొందిన కేసిరెడ్డి లావణ్య- నరసింహారెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ గెలుపుకు కృషి చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితమవుతామని స్పష్టం చేశారు. తమను నాలుగోసారి గెలిపించడం మరువలేనిదని అన్నారు. వార్డు ప్రజలు తమను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. నాలుగోసారి గెలిచిన అపురూపమైన అరుదైన అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. నాలుగో సారి గెలిచినప్పటికీ ప్రజలతోనే మమేకమవుతూ వారి ముంగిట్లోనే ఉంటూ ఎప్పటిలాగే సేవలందిస్తామని అన్నారు. వార్డులో ప్రజల, వైద్యుల, వ్యాపారుల, మహిళల, యువత ప్రేమాభిమానాలు తమను ముగ్ధుల్ని చేశాయని చెప్పారు. వార్డు అభివృద్ధికి తాము శక్తి వంచన లేకుండా కృషి చేశామని సమస్యల పరిష్కారానికి తమ వంతు పాత్ర పోషించామని అన్నారు. ఎన్నికలు ముగిశాయని ఎన్నికల సందర్భంగా తదనంతరం ఎక్కడ రాజకీయాల ప్రస్తావన లేదని రాజకీయాలకు అతీతంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. 26వ వార్డును హుజురాబాద్ లోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న ఒక్క ఫోన్ కాల్ తో వారి ముంగిట్లో వాలిపోతామని స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు దూరంగా, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండడం వల్లే ఈ అరుదైన నాలుగోసారి గెలుపు అవకాశం దక్కిందని ఇది ఒక బాధ్యతగా తామూ స్వీకరిస్తున్నామన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. నాలుగోసారి గెలుపొందిన లావణ్య నరసింహారెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం లావణ్య నరసింహారెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదని వారికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా అవార్డు ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు, వైద్యులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ మునిసిపల్ 26వ వార్డులో ఆత్మీయ సమ్మేళనంకు హాజరై కౌన్సిలర్ కేశరెడ్డి లావణ్య నరసింహారెడ్డి దంపతులను ఘనంగా సన్మానిస్తున్న వార్డు ప్రజలు, అభిమానులు

ప్రేమపూర్వక భోజనాలు చేస్తున్న ప్రముఖ వైద్యులు..

ఆత్మీయ సమ్మేళనముకు హాజరై భోజనాలు చేస్తున్న వార్డు ప్రజలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!