23-02-2026 NORMAL NEWS 12:13 AM
swarnodayam.com
Telugu Daily News
23-02-2026 12:13 AM By Mandala Yadagiri

ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. – సుమారు 300 మందికి వైద్య పరీక్షలు, మందుల పంపిణీ.

ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. – సుమారు 300 మందికి వైద్య పరీక్షలు, మందుల పంపిణీ.
IMG-20260223-WA0019(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోనీ శ్రీరామ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం డాక్టర్ శ్రీకర్ మోడేపు జనరల్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. డాక్టర్ శ్రీకర్ మోడేపు సుమారు 300 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా షుగర్ పరీక్ష, కొలెస్ట్రాల్ పరీక్ష, యూరిక్ ఆసిడ్ పరీక్ష, నరాల బలహీనత పరీక్ష, బిఎండి పరీక్ష తదితర పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ప్రతి మంగళవారం షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా షుగర్ పరీక్షలు, ఓపి ఉచితంగా చూడడం జరుగుతుందని, శ్రీరామ హాస్పిటల్ ను సంప్రదించాలని వారు సూచించారు. అంతేగాక 24 గంటల వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయని, ప్రజలు శ్రీరామ హాస్పిటల్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీకర్ మోడెపు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హాస్పిటల్ నిర్వాహకులు నంబి భరణికుమార్, ముష్కే శ్రీనివాస్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!