Social 1080×1350 • Multi-page
27-02-2026 BREAKING NEWS 08:49 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. – ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి. – ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260227_204614

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసిల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని డిల్లీలో జాతీయ స్థాయి భారీ మహా ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చామని ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ధర్నాలో పాల్గొని విజయవంతం చేసి శుక్రవారం కరీంనగర్ కి చేరుకున్న పోలాడి రామారావుకు శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు ఓసి ఐకాస నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకుల తో కలిసి విలేకరులతో రామారావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా పటిష్టంగాసంపూర్ణంగా అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ కి కేటాయించగా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితిని విధించాలని, రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతుల భాగస్వామ్యం ఉండే రైతు చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఢిల్లీలో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి భారీ మహా ధర్నాలోని డిమాండ్లను అనంతరం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరెంతవరకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వాలకు ఆరు నెలల గడువు ఇస్తున్నామని తక్షణమే డిమాండ్లను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐకాస రాష్ట్రఉమ్మడి జిల్లా నాయకులు వేముల సుదర్శన్ రెడ్డి, చెన్నాడి నర్సింహారెడ్డి, ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కొత్తకొండ రవీందర్ రావు, తీగల లక్ష్మణ్ రావు, ఏళ్ళల సదానందరెడ్డి, కరివేద సుధాకర్ రెడ్డి, బొంపెల్లి శోభితరావు, బూరుగు అనంతరెడ్డి, తోపు చర్ల శ్రీనివాస్ రావు, విక్రమ నరసింహరావు, దడిగేలా వెంకట్ రావు, పట్నాయక్ తదితరులు ఉన్నారు.

పుష్పగుచ్చలిచ్చి శాలువా కప్పి సత్కరించిన అనంతరం వారి ఉద్దేశించి మాట్లాడుతున్న పోలాడి రామారావు..

విజయానందం వ్యక్తం చేస్తున్న ఓసీ జేఏసీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!