Social 1080×1350 • Multi-page
28-02-2026 BREAKING NEWS 03:59 PM
swarnodayam.com
Telugu Daily News

శాస్త్రీయ పరిశోధనలు ప్రగతికి మూలం..- కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్

శాస్త్రీయ పరిశోధనలు ప్రగతికి మూలం..- కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్
IMG-20260228-WA0044

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శాస్త్రీయ పరిశోధనలు మానవ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాయని ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 6వ జాతీయ ఇన్నోవేషన్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక శాస్త్రము ఇంజనీరింగ్ విద్యకు పునాది వంటిదన్నారు. సర్ సి.వి. రామన్ ” రామన్ ఎఫెక్ట్” ను కనుగొన్నారని అన్నారు. రామన్ కనుగొన్న విషయాలకు ప్రయోగపూర్వకమైన నిరూపణలు ఉన్నాయన్నారు. ఈ ఫలితాలు సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. రామన్ పరిశోధనలకు 1930వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించినదన్నారు. కళాశాల
రిజిస్టార్ డాక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆలోచనలను ప్రాజెక్టు రూపంలో చేయాలన్నారు.
విద్యార్థులకు ఏమైనా సహాయ సహకారాలు కావలసి వస్తే అధ్యాపకుల సేవలను తీసుకోవాలన్నారు.
విద్యార్థి తమ ఆలోచనలను ఇతరులకు చెప్పటంలో ఎటువంటి సంకోచం వద్దన్నారు. ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం వలన మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయన్నారు. ఇన్నోవేషన్ అనగా కొత్త విషయాలు కనుక్కోవడం వలన సమాజానికి ఉపయోగపడతాయని అన్నారు. కళాశాల డీన్ అకాడమిక్స్ డాక్టర్ జి. మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను ఆధారముగా చేసుకొని సమాజానికి ఉపయోగపడే పరికరాలు తయారు చేయాలని అన్నారు. డీన్ స్టూడెంట్స్ అఫ్ఫైర్ డాక్టర్ యోగేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని అన్నారు. కళాశాల ఇనిస్ట్యూట్ ఇన్నోవేషన్ సెల్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్ .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి మొత్తము 65 పరిశోధన పత్రాలు ఈ కార్యక్రమంలో చర్చించారని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!