Social 1080×1350 • Multi-page
01-03-2026 BREAKING NEWS 06:48 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మునిసిపాలిటీ 26 వార్డులో… – మున్సిపల్ కార్మికులతో కౌన్సిలర్ దంపతుల ఆత్మీయ సమ్మేళనం

హుజురాబాద్ మునిసిపాలిటీ 26 వార్డులో… – మున్సిపల్ కార్మికులతో కౌన్సిలర్ దంపతుల ఆత్మీయ సమ్మేళనం
IMG-20260301-WA0060

కార్మికులతో సహపంక్తి భోజనాలు – పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరెలు పంపిణీ చేసిన కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి

ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికుల కుటుంబాలతో మాట మంతీ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మార్చి01: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ 26వ వార్డులో కౌన్సిలర్ గా వరుసగా నాలుగో సారి గెలుపొందిన కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి ఆదివారం పారిశుద్ధ్య కార్మికుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. వారితో ముచ్చటించారు. వారి కుటుంబాల వివరాలు, కష్ట సుఖాలు అన్నీ తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. అలాగే వారికి వస్త్రాలను కట్న కానుకలుగా అందజేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారితో ఉల్లాసంగా గడిపారు.

మున్సిపల్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరిస్తున్న కౌన్సిలర్ కేసు రెడ్డి లావణ్య నరసింహారెడ్డి దంపతులు..

ఈ సందర్భంగా కౌన్సిలర్ లావణ్య నరసింహారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు పోషిస్తున్న పాత్ర మరువలేదని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లనే హుజురాబాద్ రోడ్లు సుందరంగా కనిపిస్తున్నాయని ప్రశంసించారు. ప్రజలు లేవకముందు నుండే వారి దినచర్య ప్రారంభమవుతుందని అన్నారు. వీధుల్లో, డ్రైనేజీల్లో నుండి చెత్తను తొలగించేందుకు వారు చేస్తున్న కృషి మరువలేనిది అన్నారు. గత 20 సంవత్సరాలుగా వార్డు లో ఎంతో సహకరిస్తున్నారని వారి రుణం తీర్చుకోలేనిదని ప్రశంసించారు. తాము చెప్పిన ప్రతి పనిని వారు కాదనకుండా చేశారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను కార్మికులు గా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించాలని అన్నారు. వారు ఒక్క రోజు పనిచేయకున్నా హుజురాబాద్ చెత్తతో నిండిపోతుందని అన్నారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. కాగా గతం లోనూ హుజురాబాద్ లో కేసిరెడ్డి లావణ్య దంపతులు మున్సిపల్ లో నీ 110మంది పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు రూ.4 లక్షల రూపాయలు విలువైన సరుకులు వ్యాపారులు, దాతల సహకారంతో కరోనా సందర్భంగా వార్డులో పంపిణీ చేశారు. కార్మికులకు వైద్య సేవలు, ఏదైనా సహాయం చేస్తున్న లావణ్య దంపతులు కార్మికుల పక్షపాతిగా ఉంటూ వారి కష్టా సుఖాల్లో ఉంటారు.

పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టలు పెట్టి శాలువాలతో ఘనంగా సత్కరించిన కౌన్సిలర్ దంపతులు

పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనాలు చేస్తున్న కౌన్సిలర్ దంపతులు లావణ్య నరసింహారెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!