Social 1080×1350 • Multi-page
01-03-2026 BREAKING NEWS 11:07 PM
swarnodayam.com
Telugu Daily News

పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత : -మన ఊరి న్యూస్ సీఈవో మసున లక్ష్మణ్ కుమార్

పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత : -మన ఊరి న్యూస్ సీఈవో మసున లక్ష్మణ్ కుమార్
Oplus_16908288

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ మార్చి 01: పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని
మన ఊరి న్యూస్ సీఈవో మసున లక్ష్మణ్ కుమార్ అన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం జల్ పల్లి డివిజన్, శ్రీరామ కాలనీలో విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఇంట్లోని చెత్తను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ మునిసిపల్ సిబ్బందికి మాత్రమే చెత్తను అందజేసి రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. రోడ్లపై చెత్త వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ప్రజలు వివిధ రోగాల బారిన పడుతూ.. అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకరిద్దరు చేసే తప్పిదాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది.. అందువల్ల ప్రజలు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భవిష్య స్కూల్, కోటి విద్యాలయం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!