Social 1080×1350 • Multi-page
02-03-2026 BREAKING NEWS 05:19 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ వాసి గంగిశెట్టి అక్షిత సీఏలో ఘన విజయం : – స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమెది !

హుజూరాబాద్ వాసి గంగిశెట్టి అక్షిత సీఏలో ఘన విజయం : – స్ఫూర్తిదాయక ప్రయాణం ఆమెది !
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణానికి చెందిన గంగిశెట్టి అక్షిత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అక్షిత సాధించిన ఈ విజయం ఆమె మొక్కవోని దీక్షకు, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. బావుపేట క్రాస్ రోడ్ లోని ఎస్పీఆర్ (SPR) స్కూల్‌లో పదవ తరగతి పూర్తి చేసిన అక్షిత, సీఏ కోర్సుపై ఉన్న ప్రత్యేక ఆసక్తితో ‘సిఎంఎస్ ఫర్ సీఏ’ (CMS for CA) సంస్థలో చేరారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థ ‘HNA హైరగంగే అండ్ అసోసియేట్స్’లో ఆర్టికల్ షిప్ పూర్తి చేసి వృత్తిపరమైన నైపుణ్యాలను గడించారు.
ఈ మైలురాయిని అధిగమించడంలో తన తల్లిదండ్రులు గంగిశెట్టి రవీందర్ – రజితల నిరంతర ప్రోత్సాహం ఎంతో ఉందని అక్షిత పేర్కొన్నారు. ముఖ్యంగా తన మామ చొల్లేటి రమేష్ (CA), అత్త చొల్లేటి వరలక్ష్మి (CA) ఇద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్లే కావడం, వారు అందించిన సరైన గైడెన్స్, స్ఫూర్తి మరియు ధైర్యం తనను ఈ లక్ష్యం వైపు నడిపించాయని ఆమె సగర్వంగా తెలిపారు. కుటుంబంలోని సీఏ నిపుణుల మార్గదర్శకత్వంలో అనేక సవాళ్లను అధిగమించి ఈ విజయాన్ని అందుకున్న అక్షితకు కుటుంబ సభ్యులు, 1988 ఎస్ఎస్సి బ్యాచ్ సభ్యులు, బంధుమిత్రులు మరియు విద్యానగర్ వాసులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తల్లిదండ్రులు గంగిశెట్టి రవీందర్ – రజితలతో గంగిశెట్టి అక్షిత..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!