Social 1080×1350 • Multi-page
02-03-2026 BREAKING NEWS 05:56 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ అవార్డుకి ఎంపికైన చెల్పూర్ కు చెందిన ఉపాధ్యాయుడు రాకేష్ రెడ్డి.. – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అందుకోనున్న అవార్డు

జాతీయ అవార్డుకి ఎంపికైన చెల్పూర్ కు చెందిన ఉపాధ్యాయుడు రాకేష్ రెడ్డి.. – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అందుకోనున్న అవార్డు
IMG-20260302-WA0038

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చేల్పూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు PRTU భూపాలపల్లి జిల్లా అద్యక్షుడు ఆరే రాకేష్ రెడ్డి సామాజిక సేవా విభాగంలో ఉత్తమ డిఫెండర్ అవార్డుకు ఎంపికైనట్లు ప్రఖ్యాత PAN INDIAN సంస్థ ప్రకటించింధి

అత్యధిక సార్లు రక్తదానం చేయడం, ఇతరులను ప్రోత్సహించడం, యువ నేతాజీ ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం,
సమాచార విస్తరణ, సామాజిక స్పూహ నాయకత్వ లక్షణాలకు ఈ అవార్డు ఎంపిక చేసినట్లు PAN INDIAN సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

మార్చి 8వ తేదీ ఆదివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిర్లా సైన్స్ ఆడిటోరియంలో అవార్డ్ ప్రదానోత్సవం హిమాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు సినీ నటి ఆమని చేతుల మీదుగా ఈ అవార్డును ప్రధానం చెయ్యనున్నారు. రాకేష్ రెడ్డి అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆయన మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

అవార్డుకు ఎంపికైన చెల్పూర్ వాసి ఆరే రాకేష్ రెడ్డి…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!