Social 1080×1350 • Multi-page
04-03-2026 BREAKING NEWS 10:49 PM
swarnodayam.com
Telugu Daily News

ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగ వేడుకలు.. -ఆకట్టుకున్న శ్రీరామ ఆసుపత్రి సిబ్బంది వేడుకలు.

ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగ వేడుకలు.. -ఆకట్టుకున్న శ్రీరామ ఆసుపత్రి సిబ్బంది వేడుకలు.
IMG-20260304-WA0141

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రంగుల పండుగ హోలీ పర్వదిన వేడుకలు హుజురాబాద్ పట్టణంలో బుధవారం ప్రజలు రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో పాక్షికంగా హోలీ వేడుకలు కొంతమంది మాత్రమే జరుపుకున్నారు. బుధవారం ఉదయం నుండే యువతీ యువకులు పిల్లలు పెద్దలు, వయసుతో సంబంధం లేకుండా తమ స్నేహితులతో బంధువులతో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. పలువురు వాహనాలపై స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్లి వారికి రంగులు తల్లి వారిని కూడా వారితో తీసుకొని వెళ్లి హై స్కూల్ మైదానంలో పాటల కనుగుణంగా నృత్యాలు చేశారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, మాజీ చైర్పర్సన్ గందె రాధిక, టౌన్ సీఐ టీ కరుణాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు వర్ధిలేని రవీందర్ రావు, ఇల్లందుల సమ్మయ్య, గందె శ్రీనివాస్, జే భాస్కర్, న్యాయవాదులు ముక్కెర రాజు, లక్ష్మణమూర్తి, కొత్తూరి రమేష్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, బిజెపి నాయకులు తూర్పాటి రాజు, కొలిపాక శ్రీనివాస్, పంజాల కళాధర్, కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, విడపు రాజు, కత్తరమల్ల సదానందం, పంజల శ్రీధర్, వి సతీష్, సాయి, భాస్కర్, నీరటి రమేష్, రాజలింగారెడ్డి, పొనగంటి శ్రవణ్ కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాగిత రాములు, రవీందర్, స్వర్ణోదయం ప్రతినిధి మండల యాదగిరి, పలువురు జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీరామ ఆసుపత్రి వద్ద హోలీ వేడుకల దృశ్యాలు..
Oplus_16908288

ఆకట్టుకున్న శ్రీరామ ఆసుపత్రి సిబ్బంది వేడుకలు.

పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో గల శ్రీరామ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీకర్ మోడెపు ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులు సిబ్బంది ఒకరికొకరు కలర్లు అడ్డుకొని ఆనంద ఉత్సాహాలతో రంగుల కేలి హోలీ వేడుకలు జరుపుకున్నారు. సిబ్బందికి డాక్టర్ శ్రీకర్ స్వీట్లు తినిపించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు నంబి భరణి కుమార్, ముష్కి శ్రీనివాస్ యాదవ్, తిరుపతి, ఆసుపత్రి సిబ్బంది అఖిల, కావ్య, శ్రీనిధి, సంధ్య, నిఖిల్, అఖిల, భవాని, సాయి, శ్రీనివాస్, అర్చన తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ పట్టణంలో ఆకట్టుకున్న హోలీ వేడుకలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!