Social 1080×1350 • Multi-page
08-03-2026 BREAKING NEWS 02:37 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రజా పాలనలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

ప్రజా పాలనలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం
IMG-20260307-WA0048(2)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా పాలన.. ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా శనివారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదు వార్డుల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ను చేపట్టారు. ఈ సందర్భంగా 1, 3, 6, 9, 25 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా చెత్తాచెదారాన్ని తొలగించడం మురికి కాలువలను శుభ్రం చేయడం, మోడల్ చెరువు కట్ట వెంబడి, మెట్లపై వున్నా చెత్త చెదారమును తొలగించారు. మునిసిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాన్ని మునిసిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని సందర్శించి పర్యవేక్షించారు. కాగా ఆయా వార్డుల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్లు మేకల స్వరూప, గందె శ్రీనివాస్, బండ సింధూజ, ఇల్లందుల సమ్మయ్య, కొండ ప్రశాంతి, కమీషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి , సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్ ఆయా వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది కార్మికులు, పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!