Social 1080×1350 • Multi-page
08-03-2026 BREAKING NEWS 09:23 PM
swarnodayam.com
Telugu Daily News

29వ వార్డులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. – మహిళల గౌరవమే లక్ష్యంగా ముందుకు.. – కౌన్సిలర్ బొరగాల మొగిలి

29వ వార్డులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. – మహిళల గౌరవమే లక్ష్యంగా ముందుకు.. – కౌన్సిలర్ బొరగాల మొగిలి
IMG-20260308-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మార్చి 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్ పట్టణంలోని 29వ వార్డులో నూతనంగా ఎన్నికైన ఆ వార్డు కౌన్సిలర్, రిటైర్డ్ ఏఈ (AE) బొరగాల మొగిలి ఆధ్వర్యంలో వార్డులోని మహిళలను గౌరవిస్తూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న మహిళా మూర్తులను ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మహిళా చైతన్యం ఉట్టిపడింది.

వివిధ రంగాలకు చెందిన మహిళలను సన్మానిస్తున్న కమిషనర్ బోరగాల మొగిలి..
మాట్లాడుతున్న కౌన్సిలర్ బొరగాల మొగిలి..

సేవకుడిగా ప్రజల చెంతకు:
రిటైర్డ్ ఏఈ గా సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలో అనుభవం గడించిన బొరగాల మొగిలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన మహిళా దినోత్సవం కావడంతో, వార్డులోని ఆడబిడ్డలందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి వారిని శాలువాలతో సత్కరించడం, చిరు జ్ఞాపికలు అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితం – కౌన్సిలర్ మొగిలి:
ఈ సందర్భంగా కౌన్సిలర్ బొరగాల మొగిలి మాట్లాడుతూ.. తన పిలుపు మేరకు విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రణవ్ బాబు నాయకత్వంలో హుజూరాబాద్ మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మరియు ఉన్నతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రణవ్ అభివృద్ధి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఒక సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

మహిళా శక్తికి నీరాజనం:
వేల్పుల రత్నం మరియు ఇతర ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ శక్తి ఉంటుందని కొనియాడారు. ముఖ్యంగా మొగిలి కౌన్సిలర్‌గా విజయం సాధించడంలో వారి ధర్మపత్ని అందించిన సహకారం వెలకట్టలేనిదని ప్రశంసించారు. తన పదవీ కాలం ముగిసే వరకు ప్రతి ఏటా ఇదే ఉత్సాహంతో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తానని, మహిళల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని బోరగాల మొగిలి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఘన సన్మానం – బహుమతుల ప్రదానం..
ఈ వేడుకల్లో భాగంగా అంగన్‌వాడీ టీచర్ రొంటాల పద్మ, ఆశా కార్యకర్తలు తిరుమల, ప్రమీల, మెప్మా ఆర్పి బొరగాల రమాదేవిలతో పాటు మున్సిపల్ సిబ్బంది రొంటాల భాగ్య, గిన్నారపు లక్ష్మి తదితరులను కౌన్సిలర్ మొగిలి శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను బహుమతిగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, బత్తుల రాజలింగం, సందీప్, బీజేపీ నాయకులు తూర్పాటి రాజు, బొరగాల సారయ్య, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, పాత్రికేయులు మరియు వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!