Social 1080×1350 • Multi-page
10-03-2026 BREAKING NEWS 07:51 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఇన్చార్జి ఏఎల్ వో గా చంద్రశేఖర్ రెడ్డి

హుజురాబాద్ ఇన్చార్జి ఏఎల్ వో గా చంద్రశేఖర్ రెడ్డి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఇన్చార్జి సహాయ కార్మిక శాఖ అధికారి (ఏఎల్వో )గా చంద్రశేఖర్ రెడ్డి సోమవారం కార్మిక శాఖ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం హుజురాబాద్ ఏఎల్ వో గా ఉన్న డి చందనపై విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కార్మిక శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆమెను సస్పెండ్ చేశారు. దాంతో కరీంనగర్ కార్మిక శాఖ అధికారిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని హుజురాబాద్ ఇన్చార్జి ఏఎల్ వో గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో, ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కార్మికులు తమ సమస్యల కోసం కార్యాలయంలో తనను సంప్రదించాలని, ఇకముందు క్లెయిమ్ ల విషయంలో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పెండింగ్ లేకుండా చూడడం జరుగుతుందని తెలిపారు.

హుజురాబాద్ ఇన్చార్జి సహాయ కార్మిక శాఖ అధికారి (ఏఎల్వో )గా బాధ్యతలు చేపడుతున్న చంద్రశేఖర్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!