10-03-2026 NORMAL NEWS 10:46 PM
swarnodayam.com
Telugu Daily News
10-03-2026 10:46 PM By Mandala Yadagiri

ఆల్ఫోర్స్ లో ఆకట్టుకున్న అడియోస్(వీడ్కోలు వేడుకలు)

ఆల్ఫోర్స్ లో ఆకట్టుకున్న అడియోస్(వీడ్కోలు వేడుకలు)
IMG-20260310-WA0574

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని స్థానిక ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో మంగళవారం రోజున పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి .నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాల నుండి మొదటి ఎస్ఎస్సి విద్యార్థులను పంపిస్తున్నామని విద్యార్థులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టుదలతో చదివినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చదివితే సాధించలేనిది ఏది ఉండదని తెలిపారు. ఆ తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు..

ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి .నరేందర్ రెడ్డికి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేస్తున్న విద్యార్థులు..

మాట్లాడుతున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!