Social 1080×1350 • Multi-page
11-03-2026 BREAKING NEWS 04:51 PM
swarnodayam.com
Telugu Daily News

హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ యువకుడు బొగ్గుల రాహుల్ మృతి.. అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులు.

హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ యువకుడు బొగ్గుల రాహుల్ మృతి.. అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులు.
IMG_20260311_164458

–హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో మృతి.

–జీవన్దాన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి మృతుడి అవయవాల దానం

–నా కుమారుడికి మరణం లేదు, మరణించిన తన అవయవ దానం ద్వారా మరొకరి ప్రాణం నిలబడిందీ.. మృతుడి తండ్రి బొగ్గుల రాజేశం.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన బొగ్గుల రాహుల్ అనే యువకుడు హైదరాబాద్ సోమాజిగూడలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్కూటీపై నుంచి కింద పడి తలకు, మొహానికి తీవ్ర గాయాలు కాగా తక్షణమే సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. హుజురాబాద్ పట్టణంలోని వివేకనంద కాలనీకి చెందిన బొగ్గుల రాజేశం- అనురాధ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడైన బొగ్గుల రాహుల్ హైదరాబాదులోనీ టీసిఎస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రోజు నైట్ షిఫ్ట్ చేసే క్రమంలో డ్యూటీ ముగించుకొని ఉదయం 5:00 తిరిగి తన రూమ్ కి వెళ్తుండగా సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రి ముందు యూటర్న్ తీసుకునే క్రమంలో తను స్కూటీపై నుంచి అదుపుతప్పి కింద పడగా తలకు, మొహానికి తీవ్ర గాయాలు కాగా అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర గాయాలైన బొగ్గుల రాహుల్ ని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వెంటనే బొగ్గుల రాహుల్ మొబైల్ ఫోన్లో రీసెంట్ కాల్స్ చెక్ చేసి వాళ్ళ అన్నకు కాల్ చేసి సమాచారాన్ని అందించారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవ్వడంతో రాహుల్ మృతి చెందాడు. కాగా మృతుడి అవయవాలను వారి కుటుంబ సభ్యులు జీవన్దాన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి దానం చేశారు. ఈ అవయవ దానం ద్వారా మరొకరి ప్రాణం నిలబడుతుందని మృతుడి తండ్రి బొగ్గుల రాజేశం తెలిపారు. నా కుమారునికి మరణం లేదు, నా కుమారుడు మరణించిన మరొకరి ప్రాణాన్ని నిలబెట్టాడు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ అవయవ దానం చేసిన మృతుడు బొగ్గుల రాహుల్ కి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఘనంగా ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్స్ నివాళులర్పించారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు గురైన రాహుల్

బొగ్గుల రాహుల్ (ఫైల్ ఫోటో)

Oplus_16908288

.రాహుల్ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!