Social 1080×1350 • Multi-page
11-03-2026 BREAKING NEWS 06:05 PM
swarnodayam.com
Telugu Daily News

కవితక్క దీక్షకు తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మద్దతు..

కవితక్క దీక్షకు తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మద్దతు..
IMG_20260311_175945

–పేదల ఇల్లులు కూల్చడమే కాంగ్రెస్ ప్రజాపాలన నా..
–పేదల బ్రతుకులపై బుల్డోజర్లు పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..

– తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆవేదన.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రభుత్వము భూదాన భూములలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేద ప్రజల ఇళ్లను అన్యాయంగా కూల్చేసి రాజకీయ బడా నాయకులకు ధార దత్తం చేయడం కోసమే స్థానిక జిల్లా కలెక్టర్ పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని, ఇట్టి విషయంపైన ఖమ్మంలో వెలుగుమట్ల ఇల్లు లేని పేద ప్రజల కోసం ప్రజాసామికంగా పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క ని మరియు డాక్టర్ విశారదన్ మహారాజ్ ను పోలీసులు అరెస్టు చేయడానికి తమ సంఘం వ్యతిరేకిస్తుందని తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధినేత్రి కవితక్క ధైర్యానికి, నిబద్ధతకు మనమందరం సెల్యూట్ చేయాలన్నారు. అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గను… బాధితులకు న్యాయం జరిగే వరకు నా దీక్ష ఆగదు అని కవితక్క చెప్పడం ఆమె ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం అని అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు లోకినీ రాజు..

వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసి బాధితులను రోడ్డున పెట్టిన ప్రభుత్వం వెంటనే దిగివచ్చి అదే చోట వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలనీ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వారికి న్యాయం చేయాలన్నారు. కవితక్క పోరాటం ఒక వ్యక్తి కోసం కాదు… అది బాధితుల గుండె నొప్పి కోసం, వారి భవిష్యత్తు కోసం అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలనీ, అప్పటివరకు ఈ పోరాటం ఆగదు, ఈ దీక్ష ఆగదు, న్యాయం జరిగే వరకు కవితక్క కు తెలంగాణ ఆదివాసి జాగృతి అండగా ఉంటుందని తెలియజేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తమ సంఘం సిద్ధంగా ఉందని లోకిని రాజు పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న లోకిని రాజు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!