11-03-2026 NORMAL NEWS 07:15 PM
swarnodayam.com
Telugu Daily News
11-03-2026 07:15 PM By Mandala Yadagiri

రైతు మహాగర్జనకు హరీశ్ రావు మద్దతు.. – సభకు హరీశ్ ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

రైతు మహాగర్జనకు హరీశ్ రావు మద్దతు.. – సభకు హరీశ్ ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG_20260311_190933

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హైదరాబాద్): అన్న దాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఓసిల కార్పొరేషన్ లకు పాలకమండళ్ళు ఏర్పాటుచేసి 3 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లక్ష మందితో కరీంనగర్ లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి రైతు మహాగర్జన సమరభేరికి రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీశ్ రావుని బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులతో కలిసి రైతు మహాగర్జన ఏర్పాట్ల గురించి హరీశ్ రావుకు వివరించి సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం రామారావు అందజేశారు.

కరీంనగర్ రైతు మహాగర్జనకు హరీష్ రావును ఆహ్వానిస్తున్న పోలాడి రామారావు

భకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు తాను స్వయంగా సభకు హాజరవుతానని హరీశ్ రావు ప్రకటించి రైతు మహాగర్జన సమర భేరి సభ పోస్టర్ ను రామారావుతో కలిసి హరీశ్ రావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ పార్టీల కతీతంగా నాయకులను స్వయంగా కలిసి సభకు ఆహ్వాన పత్రికలను అందజేసి అందరి మద్దతు కూడగడ్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో పు
రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని లేకుంటే 16వ తేదీన ఓసి ఐకాస రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది అన్నదాతలతో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులను అవహేళన చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే సిఎం రేవంత్ సర్కార్ అన్నదాతల సంక్షేమంపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. 50 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు ఆరు వేల పెన్షన్ మంజూరు చేయాలని, రైతు భీమా వయో పరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతులకు అన్ని విభాగాల్లో 20 లక్షల ఉచిత వైద్యసౌకర్యం ఏర్పాటుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకంతో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని కోరారు.
రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతుల భాగస్వామ్యంతో ఉండే రైతు చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న లక్ష మందితో కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నామని, అన్ని పార్టీల వారిని ఆహ్వానిస్తున్నా మని పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసి ఐకాస రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నదిపెల్లి వెంకటేశ్వర్ రావు, రైతు ప్రజాసంఘాల రాష్ట్ర కన్వీనర్ నవీన్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు చకిలం రమణయ్య, నర్సయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_16908288

రైతు మహాగర్జన సమర భేరి సభ పోస్టర్ ను రామారావుతో కలిసి హరీశ్ రావు ఆవిష్కరిస్తున్న దృశ్యం

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!