Social 1080×1350 • Multi-page
13-03-2026 BREAKING NEWS 08:21 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజాపాలనలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బల్దియా చైర్పర్సన్ సుహాసిని

ప్రజాపాలనలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బల్దియా చైర్పర్సన్ సుహాసిని
IMG-20260313-WA0076

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో భాగoగా శుక్రవారం ఐదు వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మునిసిపాలిటీ పరిధిలోనీ 2, 22, 24, 26వ వార్డులలో మున్సిపల్ సిబ్బంది కార్మికులు డ్రైనేజీలు శుభ్రం చేయడం, జెసిబితో చెత్తాచెదాలన్ని తొలగించడం, వాటర్ ట్యాంక్ లను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని పాల్గొని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల చెంతకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సమ్రీన్, వడ్లూరి శ్రీలేఖ, నాంపల్లి శ్రీనివాస్, కేసిరెడ్డి లావణ్య, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, ఇంజినీర్ ఎన్ సుధాకర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, పారిశ్యుద్ద సిబ్బంది పాల్గొన్నారు.

26వ వార్డులో పరిశీలిస్తున్న చైర్పర్సన్ సుహాసిని..

24వ వార్డులో మురుగు కాలువల సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న చైర్పర్సన్ సుహాసిని, కమిషనర్ ముసబ్ అహ్మద్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!