Social 1080×1350 • Multi-page
14-03-2026 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

మారుతి ఏజెన్సీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ప్రారంభం

మారుతి ఏజెన్సీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ప్రారంభం
IMG-20260314-WA1107

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో మాచర్ల రాజు ఆధ్వర్యంలో ప్రారంభించిన మారుతి ఏజెన్సీ ఈవీ షోరూం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా ఇంధనం ఆదా కావడంతో పాటు పర్యావరణానికి ముప్పు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, మరో అతిథి ప్రేమ్ రెడ్డి, రాజు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు..

ఈవీ వాహనాన్ని నడుపుతున్న ప్రణవ్ బాబు

హాజరైన మరో అతిథి ప్రేమ్ రెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!