Social 1080×1350 • Multi-page
16-03-2026 BREAKING NEWS 07:23 PM
swarnodayam.com
Telugu Daily News

పారిశ్రామిక వ్యర్థాలను భవన నిర్మాణములో ఉపయోగించవచ్చును. -ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి. స్వామి నాగరత్నగిరి

పారిశ్రామిక వ్యర్థాలను భవన నిర్మాణములో ఉపయోగించవచ్చును. -ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి. స్వామి నాగరత్నగిరి
IMG_20260316_192029

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పారిశ్రామిక వ్యర్థాలతో సింథటిక్ కాంక్రీట్ల తయారీకి పరిశోధనలు జరుగుతున్నాయని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి. స్వామి నాగ రత్నగిరి అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రిన్సిపల్ డాక్టర్ కే.శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సహాయముతో బిల్డింగ్ మెటీరియల్స్ లను తయారు చేస్తున్నారన్నారు. మెటీరియల్స్ యొక్క పనితనాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో సిమ్లేషన్ చేసి పరీక్షిస్తున్నారన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శంకర్ మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు వివిధ రకములైన కంప్యూటర్ సాఫ్ట్వేర్లను నేర్చుకుని సివిల్ ఇంజనీరింగ్ పరిశ్రమలలో పని చేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అనిల్, అధ్యాపకులు ప్రజ్ఞ, దివ్య రాణి ,నిశాంత్ అలియా, జగన్, నవీన్, కిరణ్, సమన్వయకర్త మనోజ్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి. స్వామి నాగ రత్నగిరి

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!