Social 1080×1350 • Multi-page
18-03-2026 BREAKING NEWS 05:26 PM
swarnodayam.com
Telugu Daily News

100శాతం ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసి రికార్డు సృష్టించిన హుజురాబాద్ బల్దియా.. – ఘనంగా సన్మానించిన పాలకవర్గం

100శాతం ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసి రికార్డు సృష్టించిన హుజురాబాద్ బల్దియా.. – ఘనంగా సన్మానించిన పాలకవర్గం
IMG-20260318-WA0052

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పురపాలక సంఘము ప్రాపర్టీ టాక్స్ 100% వసూలు చేసి తెలంగాణలో 2 వ స్థానములో నిలిచింది. ఇంకా (13) రోజులు ఉండగానే 100% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసి రికార్డు సృష్టించడం జరిగింది. ఈ సందర్భముగా పాలకవర్గము వార్డు అధికారులను అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో చైర్ పర్సన్ సుహాసిని రోంటాల, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి మాట్లాడుతూ, అంకితభవంతో ఫీవర్ నిర్వహించిన మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. పన్నుల వసూలు పట్టణాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనిలో వార్డు కౌన్సిలర్లు, మరియు కమీషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, మునిసిపల్ ఇంజినీర్లు ఎన్. సుధాకర్ రెడ్డి, డి నరేష్ , టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశ్వనిగాంధీ, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్ పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ ను సన్మానిస్తున్న చైర్ పర్సన్ సుహాసిని

ఆర్ ఐ ఇల్లందుల రమేష్ ను సన్మానిస్తున్న మేనేజర్ భూపాల్ రెడ్డి, ఇతర ఉద్యోగులు..

మేనేజర్ భూపాల్ రెడ్డి నీ సన్మానిస్తున్న చైర్పర్సన్ సుహాసిని, ఇతర ఉద్యోగులు..

పన్నులు వసూళ్లకు కృషి చేసిన బల్దియా సిబ్బందిని సన్మానించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!